- Telugu News Photo Gallery Spiritual photos Sri siddeshwara swamy rathotsavam utsavalu: local people follows unique tradition in aspari kurnool district
ఇదో వింత ఆచారం.. పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట.. తన్నించుకోవడానికి బారులు తీరే భక్తులు..
పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడ భక్తుల అపార నమ్మకం. ఆయన కాళీ తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకొన్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్ళిపోతారు. ఈ భక్తి కాలి తన్ను క్రీడను చూడాలంటే కర్నూలు జిల్లా కు వెళ్లల్సిందే. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు.
J Y Nagi Reddy | Edited By: Surya Kala
Updated on: Apr 25, 2024 | 7:03 PM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కల్యాణం జరిపిస్తారు.

పూజారి కాలి తన్ను కధ ఎలా అంటే: మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన500 వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.ప్రతి ఏటా కర్నాటక లోనే హంపి వీరుపాక్షి స్వామి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతురు లో కూడా అదే తరహాలో మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించే వాడని భక్తులు అంటున్నారు.

అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కల్యాణం లో శ్రీ సిద్ద రామేశ్వర స్వామిభక్తులు కొన్నితప్పులు చేయడం తో ఆయన కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట

వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిషులం ను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహం తో నాట్యం చేస్తు భక్తులను తన కాళితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అలా స్వామి వారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటి కి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికి కొనసాగిస్తున్నామని చెబుతున్నారు

నేటికీ అదే ఆచారం: కల్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిషులం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తారు.

వరస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్ను కొంటు వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామి వార్లకు పూజలు నిర్వహించి అక్కడినుంచి వెళ్ళిపోతారు. తమకు మోక్షం జరుగు తుందనేఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

ఒకే రంగు తో వసంతోత్సవం: పూజారి తన్నుల సేవా కార్యక్రమ0 ముగిసిన తరువాత స్వామి వార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామి వార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకొన్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకొంటారు ఇది సంప్రదాయం అని గ్రామస్తులు అంటారు.





























