- Telugu News Photo Gallery Cinema photos Rowdy Hero Vijay Devarakonda next movies VD12, VD13 shooting updates on December 2024
Vijay Deverakonda: రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్ లో టెంక్షన్..
ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?
Updated on: Dec 22, 2024 | 3:23 PM

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.

సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?

విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్.

ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్.

ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది.

ఇందులో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్‌లో గట్టి మార్పునే తీసుకొచ్చింది.




