Sai Pallavi: చెల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. బ్యూటీఫుల్ ఫోటోస్..
ఇటీవలే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఇందులో శివకార్తికేయన్, సాయి పల్లవి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా తన చెల్లితో కలిసి వెకేషన్ వెళ్లింది సాయి పల్లవి.