- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Game Changer Movie top opening collection For USA Premiere show, Details here
Ram Charan-Game Changer: రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే. మరీ ముఖ్యంగా US ప్రీమియర్స్‌లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా షురూ అయింది. మరిప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరగబోతుంది. మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..?
Updated on: Dec 22, 2024 | 4:21 PM

ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే.

మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటి పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్‌లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలో దిగుతున్నట్టే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్.

రిలీజ్‌కు మరో 15 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంత వరకు ఇండియాలో ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా.. అది ఇండియన్ ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నం చేయట్లేదు.

ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసారు గేమ్ ఛేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాసాయి.

అందుకే భారీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.

గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో గేమ్ చేంజర్‌లో తమిళ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకుంటున్నారు.




