కొంచెం ట'మాట' కూడా విందాం.. 

17 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఎర్రగా మిలమిలలాడే టమాట చూసేందుకు అందంగా, ఆకర్షణగా ఉంటుంది. ఇది మరే ఇతర కూర గాయల్లోనూ ఉండదు. ఇవి చూపులకే కాదు, ఆరోగ్యానికీ అంతే మంచివి

TV9 Telugu

దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టమాటాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

టమాటాల్లో ఉండే లైకోపీన్‌ అల్ట్రా కిరణాల నుంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండటాన అరుగుదలకు ఉపయోగపడతాయి

TV9 Telugu

మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా గుణాలు రక్తప్రసరణ బాగుండేలా, కొలెస్ట్రాల్‌ లెవెల్‌ సమంగా ఉండేలా చేస్తాయి

TV9 Telugu

విటమిన్‌-కె బ్లడ్‌ క్లాట్స్‌ను నివారిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. బి, సి, ఇ విటమిన్లు విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం

TV9 Telugu

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేయడమే కాదు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు రాకుండా చేస్తాయి

TV9 Telugu

పొటాషియం రక్తపోటు, హృద్రోగాల బారినుంచి కాపాడుతుంది. టోమాటోల్లో ఉన్న కెరొటినాయిడ్స్‌.. లుటిన్‌, లైకోపిన్‌, బెటా కెరోటిన్‌లు కళ్లను సంరక్షిస్తాయి

TV9 Telugu

వీటిలోని ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కప్పు టొమాటో రసంలో 45 మిల్లీగ్రాముల విటమిన్‌ సి ఉంటుంది. ఇది మనకు రోజులో అవసరమయ్యే దాన్లో 75 శాతానికి సమానం. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో కూర, పచ్చడి ఎలా చేసి తిన్నా మంచిదే