గులాబీ చెట్టు నిండుగా పూయాలా? ఈ ట్రిక్స్ మీకోసం!

Samatha

17 February 2026

ఇంట్లో గులాబీ చెట్టు ఉంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అది ఎప్పుడు ఎప్పుడు గులాబీ పూలు పూస్తుందా అని వేయిట్ చేస్తారు.

గులాబీ మొక్క

ఇక కొన్ని చెట్లు చెట్టు నిండుగా పూలు పూస్తే కొన్ని చెట్లు కేవలం ఒకటి రెండు పూలు మాత్రమే పూస్తుంటాయి.

గులాబీ పూలు

అయితే మీ చెట్టు కూడా గుబురుగా పూలు పూయాలి అనుకుంటున్నారా? అయితే తప్పక పాటించాల్సిన ట్రిక్స్ ఇవే.

చెట్టు నిండా పూలు

గులాబీ మొక్కకు పేడను ఎరువుగా వేయడం వలన చెట్టు వేపుగా పెరిగి, ఎక్కువ పూలను ఇస్తుంది. అలాగే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

పేడ ఎరువు

అదే విధంగా చెట్టు నిండా పూలు పూయాలి అంటే, అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, నీటిలో నానబెట్టి,  ఆ మిశ్రమాన్ని వేర్ల వద్ద పోయాలి. ఇలా వారం రోజులు చేస్తే గులాబీ మొక్క నిండా పూలు పూస్తాయి.

అరటి పండు 

అదే విధంగా కోడి గుడ్డు పెంకుల పొడిని గులాబీ మొక్కకు వేసి,ప్రతి రోజూ తప్పకుండా నీళ్లు పోయాలి . ఇలా చేయడం వలన కూడా గులాబీ పూలు బాగా పూస్తాయంట.

కోడి గుడ్డు పెంకులు

అదే విధంగా గులాబీ మొక్కకు సూర్యర్శి చాలా అవసరం. అందువలన సూర్య రశ్మి ఎక్కువగా ఉండే చోట మాత్రమే మొకకను నాటాలి.

సూర్య రశ్మి

అదే విధంగా మొక్కను అప్పుడప్పుడూ కట్ చేస్తూ ఉండాలి. బలహీనమైన కొమ్మలు కట్ చేయడం వలన పూలు పూసే ఛాన్స్ ఉంది.

కట్ చేయడం