మధుమేహంలో పెరిగే షుగర్ లెవల్స్ నియంత్రించడానికి, ఆకలిని తగ్గించడాని పప్పుధాన్యాలు బెస్ట్. పెసర పప్పు డయాబెటిస్ పేషంట్లకు చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్-బి, పొటాషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పు బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
శాకాహారులకు పచ్చి పెసలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో మాంసం, గుడ్లలో ఉండేంత ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది.
శరీరాన్ని మరమ్మతు చేయడానికి సాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. మధుమేహ రోగులకు పెసర పప్పు మంచి ఆప్షన్.
పెసర పప్పును వివిధ రూపాల్లో తీసుకుంటారు. కొందరు కూరల్లో, మరికొందరు కిచిడీ రూపంలో తీసుకుంటారు. పచ్చి పెసలు గ్లైసెమిక్ ఇండెక్స్ 38 మాత్రమే. ఇది చాలా తక్కువ.
పెసర పప్పులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గవని నిపుణులు చెబుతున్నారు.
శరీరాన్ని మరమ్మతు చేయడానికి సాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. మధుమేహ రోగులకు పెసర పప్పు మంచి ఆప్షన్.
పెసర పప్పుతో దోసె వేసుకోని తినవచ్చు. పెసరట్టు మంచి బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పెసర పప్పుని మిగతా మసాలా దినుసులతో కలిపి ఉడికించి తినవచ్చు.