AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WATCH: అంతర్జాతీయ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం.. ఐడీ లేనిదే అనుమతించని సెక్యూరిటీ!

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అంతర్జాతీయంగా తీవ్ర అవమానానికి గురయ్యారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భద్రతా అధికారులు ఆయన గుర్తింపు కార్డు కోసం ఆపారు. ఆయన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

WATCH: అంతర్జాతీయ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం.. ఐడీ లేనిదే అనుమతించని సెక్యూరిటీ!
Pakistan Army Chief Asim Munir
Balaraju Goud
|

Updated on: Feb 15, 2026 | 1:24 PM

Share

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అంతర్జాతీయంగా తీవ్ర అవమానానికి గురయ్యారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భద్రతా అధికారులు ఆయన గుర్తింపు కార్డు కోసం ఆపారు. ఆయన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, జర్మనీలో జరుగుతున్న కాన్ఫరెన్స్‌లోకి ప్రవేశించే ముందు తన ఐడి కార్డును ప్రదర్శించమని ఒక భద్రతా అధికారి అడిగారు.. అతని పేరు, బ్యాడ్జ్ వైపు చూపిస్తూ, ఆ అధికారి, “మీరు దానిని తిప్పగలరా?” అని అడిగాడు. “అంటే, మీ ఐడి కార్డును ముందు వైపుకు తిప్పండి.” అని సూచించాడు. దీంతో ఐడీ చూపించిన తర్వాత గానీ అసిమ్ మునీర్‌ను లోపలికి అనుమతించలేదు భద్రతా సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తన బృందంతో కలిసి మ్యూనిచ్ భద్రతా సమావేశానికి హాజరయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద సాధారణ భద్రతా తనిఖీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే చాలామంది దీనిని సాధారణ భద్రతా తనిఖీ అని తోసిపుచ్చుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరోవైపు, జర్మనీకి చెందిన సింధీ రాజకీయ సంస్థ జీ సింధ్ ముత్తహిదా మహాజ్ (JSMM) అసిమ్ మునిన్ సమావేశంలో పాల్గొనడాన్ని నిరసించింది. ఆ సంస్థ సభ్యులు వేదిక వెలుపల నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, జర్మన్ ప్రభుత్వానికి JSMM చైర్మన్ షఫీ బర్ఫత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అటువంటి ప్రపంచ వేదికపై వారి ఉనికి ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

మ్యూనిచ్ భద్రతా సమావేశం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రధాన అంతర్జాతీయ వేదిక. ఇక్కడ ప్రపంచ నాయకులు, దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. సంభాషణ, సంఘర్షణ పరిష్కారానికి మ్యూనిచ్ భద్రతా సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా పరిగణిస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు