మెగాస్టార్ చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. భుజానికి కీ హోల్ సర్జరీ చేయించుకున్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆయన తెలిపారు. తన చేతికి ఉన్న పట్టీని చూసి ఆందోళన చెందవద్దని, ఇది చిన్న సర్జరీ అని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చిరంజీవి భరోసా ఇచ్చారు.