Spiritual Beliefs: కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!

Spiritual Beliefs: కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!

Anil kumar poka

|

Updated on: Nov 26, 2024 | 9:49 AM

ఉల్లి, వెల్లుల్లి, ప్రతీ ఇంట్లో దాదాపు ప్రతీ వంటలో వినియోగిస్తారు. అయితే హిందూ ఆహారంలో ఈ ఉల్లి, వెల్లుల్లిని తామసిక ఆహారంగా పరిగణిస్తారు. వీటిని రజోగుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు. వీటిని తినడం వలన విపరీతమైన కోరికలు కలుగుతాయని చెబుతారు. అందుకనే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజ సమయంలో లేదా వివిధ వ్రతాలూ, శుభకార్యాల సమయంలో ఉల్లి, వెల్లుల్లిపాయలను తినడాన్ని నిషేధిస్తారు.

కార్తీక మాసంలో ఈ ఉల్లి వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధం. ఈ రెండూ రాహు, కేతువులకు సంబంధించినవి అని అంటారు. అందుకే ఉపవాసం లేదా పూజ సమయంలో తామసిక ఆహారంగా భావించి వీటిని తినరు. తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదని భావిస్తారు. సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం కొంత మంది అసలు ఉల్లి, వెల్లుల్లిని తమ జీవితంలో అసలు తినరు. కొందరు ఈ ఉల్లి వెల్లుల్లిని కేవలం కార్తీకమాసం, లేదా పూజా సమయాల్లో తినరు. కానీ, కేవలం కార్తీకమాసం, పూజలు, నోములు, ఉపవాసాల సమయంలో మాత్రమే కాదు, ప్రతి నెలలో వచ్చే ప్రత్యేకమైన రోజులలో కూడా వీటిని తినడం నిషేధంగా పరిగణిస్తారు.

అవును ప్రతి నెలలో 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయలను తినరు. అమావాస్య తిథి.. పూర్వీకులకు సంబంధించినది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం కోసం దానాలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు తినకూడదు. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథి లక్ష్మీ దేవి సోదరుడిగా పరిగణించే చంద్రునికి సంబంధించినది. ఈ రోజున పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు తినకూడదు. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం నిషేధం. అలాగే చవితి తిథి నెలలో రెండు సార్లు వస్తుంది. ఈ తిథి రోజున వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు కూడా ఉల్లి, వెల్లుల్లి తినడం నిషేధంగా చెబుతారు. ప్రదోష వ్రతాన్ని ప్రతీ నెలా త్రయోదశి రోజున పాటిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. కనుక ఈ రోజున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదని చెబుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.