Gym Trainer: వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే.?
తమిళనాడు సేలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు జిమ్ ట్రైనర్. వర్కవుట్స్ తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్ళిన ట్రైనర్ మొహమ్మద్ అక్కడే పడిపోయాడు. అక్కడున్నవారు అది గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహమ్మద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం అలముకుంది.
సేలం టౌన్‌లో మొహమ్మద్ జిమ్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ ఎందరికో ఇక్కడ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో రోజూలానే వర్కవుట్స్ పై శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతను కూడా వర్కవుట్స్ చేస్తుంటాడు. రోజూలాగే బుధవారం కూడా వర్కవుట్స్ ముగించుకుని అనంతరం వాష్‌రూమ్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కసారిగా బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయాడు. అది గమనించినవారు వెంటనే మొహమ్మద్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హార్ట్‌ఎటాక్‌తో మహమ్మద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అధికసమయం వర్కవుట్స్ చేయడంవల్లే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

