AR Rahman: మౌనం వీడిన మోహినీ.. ఏఆర్ రెహ్మాన్‌లో తండ్రిని చూసుకున్నా..

పుకార్లు మనసు కంటే వేగంగా పరిగెడతాయి.. అందులోనూ సినీ పరిశ్రమకు సంబంధించినవి అయితే ఈ పుకార్లకు మరింత బలం. ఇటీవల ఏఆర్ రెహమాన్.. సైరా బాను దంపతులు తమ బంధానికి తెర దింపారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అదే రోజు ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహినీ కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఓ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొట్టింది. తాజాగా మోహిని డే తన మౌనాన్ని వీడింది. రెహమాన్ తో తన బంధంపై క్లారిటీ ఇచ్చింది.

AR Rahman: మౌనం వీడిన మోహినీ.. ఏఆర్ రెహ్మాన్‌లో తండ్రిని చూసుకున్నా..
Mohini Dey Denies A R Rahman Divorce Rumors
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2024 | 12:51 PM

దిగ్గజ మ్యుజిట్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ తన భార్య సైరా బానుతో 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఏఆర్ రెహమాన్ తన విడాకుల గురించి ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ఆయన అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్త (సాక్సోఫోన్ వాద్యకారుడు ‘మార్క్ హార్ట్‌సచ్‌) కు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో వీరిద్దరి డైవోర్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు విడాకులను లింక్ చేస్తూ రెహమాన్ విడాకులకు కారణం మోహిని అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మోహిని ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

అవును మోహిని డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె AR రెహమాన్‌తో తన సంబంధం గురించి మాట్లాడింది. “నేను రెహమాన్‌తో ఎనిమిదిన్నరేళ్లు పనిచేశాను. ఆయనంటే నాకు చాలా గౌరవంని చెప్పింది. అంతేకాదు ఏఆర్‌ రెహమాన్‌ తనకు తన తండ్రితో సమానం మని.. రెహమాన్‌కి తన వయసున్న కుమార్తెలున్నారని..తండ్రిని కోల్పోయిన తనను ఏఆర్‌ రెహమాన్‌ ఎప్పుడు ఒక తండ్రిలా చూసేవారని చెప్పింది. ఎటువంటి అధారాలు లేకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి.. మా గోప్యతను గౌరవించండని విజ్ఞప్తి చేసింది మోహిని డే.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి:

View this post on Instagram

A post shared by Mohini Dey (@dey_bass)

ఈ వీడియో dey_bass అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన కేవలం 17 గంటల్లోనే లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. మరోవైపు రెహమాన్ లీగల్ టీం .. ఎవరినా తప్పుడు వార్తలు రాసినా.. అవాస్తవాలు ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.