Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏసీబీ వలకు మరో అవినీతి అనకొండ.. అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ

రాష్ట్ర నీటి పారుదల శాఖలో లంచాలకు అలవాటు పడ్డ ఓ భారీ తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఓ బాధితుడి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..

Telangana: ఏసీబీ వలకు మరో అవినీతి అనకొండ.. అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ
Irrigation AE
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2024 | 10:26 AM

పెద్దపల్లి, నవంబర్‌ 26: అవినీతికి అలవాటు పడ్డ మరో తిమింగళం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. చేస్తున్న వృత్తిపై గౌరవం ఎటూలేదు. స్వామి మాల వేసుకుని కూడా గలీజు పనులు చేసే ఇలాంటి లంచగొండులకు ఎలాంటి శిక్ష వేసినా తక్కువనే చెప్పాలి. నీటి పారుదల శాఖలో ఉన్నత పదవిలో కొలువు చేస్తున్న అధికారి 90 వేల విలువ గల పనికి 45 వేల లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో కడుపు మండిన బాధితుడు గుట్టుచప్పుడు కాకుండా ఏసీబీ అధికారుల సహాయంతో ఆటకట్టించాడు. ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కాచాపూర్‌ సమీపంలోని డీ 83 ప్రధాన కాలువపై రైట్‌ సైడ్‌ బండ్‌కు దిగువన బ్రిడ్జికి మొన్న వానకాలంలో వచ్చిన వరదలతో బుంగ పడింది. ఈ పని పూర్తి చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ రూ.91,703కు టెండర్లను పిలవగా.. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన తమ్మడబోయిన శ్రీనివాస్‌ టెండర్‌ దక్కించుకున్నాడు. దీంతో ఆ పని ఆయన సకాలంలో పూర్తి చేశాడు. అయితే బిల్లు పాస్‌ చేయకుండా నీటిపారుదల శాఖ ఏఈ ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ తిప్పించుకోవడం ప్రారంభించాడు.

నీటిపారుదల శాఖ ఏఈగా ఉన్న ఓంకారం నర్సింగరావు ఎంబీ రికార్డ్‌ చేయాల్సి ఉంది. అయితే అతగాడు మాత్రం మొత్తం బిల్లు విలువలో సగం అంటే రూ.45 వేలు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో షాక్‌కు గురైన శ్రీనివాస్‌ కాళ్లవేళ్లాపడ్డాడు. చివరకు రూ.20 వేలు ఇవ్వడానికి ఏఈతో ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రూ.20 వేలతో పెద్దపల్లికి చేరుకున్న కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌.. డబ్బు ఇచ్చేందుకు ఏఈకి ఫోన్‌ చేశాడు. కలెక్టరేట్‌ కమాన్‌కు ఎదురుగా ఉన్న టీ స్టాల్‌ వద్దకు రావాలని ఏఈ నర్సింగరావు ఫోన్‌లో చెప్పాడు. దీంతో అప్పటికే ఏసీబీ అధికారులను సంప్రదించిన బాధితుడు వారి సూచనల మేరకు అక్కడి వెళ్లి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈ నర్సింగరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, ఏఈని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.