Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!

గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!
Winter Weather
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Nov 26, 2024 | 10:36 AM

డిసెంబర్‌లో వణికించే చలి.. ముందస్తుగానే టచ్‌ చేసి చంపేస్తోంది. ఓ రేంజ్‌లో పంజా విసురుతూ వామ్మో అనేలా షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను చలి చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం రికార్డ్ స్థాయిలో ఏకంగా 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోకెల్లా అతితక్కువ ఉష్ణాగ్రతలు నమోదవుతున్న మండలాల్లో కోహీర్ రెండో స్థానంలో ఉంది..ఇక్కడ పెద్ద పెద్ద కొండలు.. చుట్టూ దట్టమైన అడవి ఉండడంతో చలి తీవ్రత పెరుగుతుంది. మొదటి స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో ఇటీవల 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

అలాగే న్యాల్ కల్ లో 9.6 డిగ్రీలు, కంగ్జిలో 9.8 డిగ్రీలు, గుమ్మడిదల మండలం నల్లవెల్లిలో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణశాఖ ఈ మూడు చోట్ల అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 4 డిగ్రీల మధ్య నమోదైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 4 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది..ఒక్క అమీన్‌పూర్‌లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలు ఉండగా మిగిలిన చోట్ల 10 డిగ్రీల నుంచి 14.6 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు అతితక్కువగా నమోదవుతుండటంతో చలికి జనం వణికిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే చలి పులి పంజా విసురుతోంది.సాయంత్రం వేళల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది..అత్యల్ప ఉష్ణోగ్ర తలు నమోదవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వృద్ధులు వేడి వేడిగా సరైన ఆహారం తీసుకుంటూ పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలని సూచించారు. చిన్నారులను కూడా చలిగాలులకు బయట తిప్పవద్దన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. చలి గాలుల్లో ఆరుబయట పనిచేసే కార్మికులు, ఇల్లు లేక వీధుల్లో ఉండే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్వాసకోశ సంబందిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..