AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pashan Devi Temple: ఆ ఆలయంలో నీరు మహిమాన్వితం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే అద్భుత శక్తి.. దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక విశ్వాసాలతో ప్రసిద్ధి చెందాయి. అలాంటి విశిష్ట దేవాలయం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉంది. ఈ ఆలయం అద్భుతాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు ఇక్కడ అద్భుతమైన నీటికి కూడా ప్రసిద్ధి చెందింది.

Pashan Devi Temple: ఆ ఆలయంలో నీరు మహిమాన్వితం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే అద్భుత శక్తి.. దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ
Pashan Devi Temple
Surya Kala
|

Updated on: Nov 27, 2024 | 8:06 AM

Share

భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ను దేవతల భూమి అని పిలుస్తారు. అనేక పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని అనేక దేవాలయాలు అద్భుతాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న పాషన్ దేవి ఆలయం అటువంటి ప్రసిద్ధ చెందిన పురాతన దేవాలయం. ఈ ఆలయం భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. నైని సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయం నైనిటాల్ సందర్శించే భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది నైనిటాల్‌లోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు ఇక్కడ అద్భుతమైన నీటికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని నీటి వలన ప్రజల రోగాలు నయమవుతాయని ప్రతీతి.

అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది

నైనిటాల్‌లోని పాషన్ దేవి ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని పాషన్ దేవిగా పేరు రావడానికి కారణం దేవత విగ్రహం ఇక్కడ సహజంగా ఏర్పడింది. పాషన్ దేవి విగ్రహం ఒక రాతిపై ఉంది. దీని ఆకారం దేవత రూపంలో ఉంటుంది. ఇక్కడ భగవతి దేవి విగ్రహం సహజమైన రాతితో ఏర్పడిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ అమ్మవారిని పాషన్ దేవి అంటారు. “పాషన్” అంటే రాయి ఈ ఆలయంలోదేవత విగ్రహంతో సహా మొత్తం ఆలయం రాళ్లతో నిర్మించబడింది. దుర్గా దేవి (నవ దుర్గా) ప్రాతినిధ్యంగా భక్తులు పూజిస్తారు.

ఈ ఆలయంలోని నీరు అద్భుతం

పాషన్ దేవి ఆలయంలోని నీరు అద్భుతంగా, పవిత్రంగా పరిగణించబడుతుంది. దీనిపై అనేక నమ్మకాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉండే నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ నీటిని తాగడం లేదా స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని.. ముఖ్యంగా చర్మ సంభదిత వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ నీటికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. ఈ నీటిని నిజమైన హృదయంతో సేవించే భక్తుల సమస్యలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

నీరు రోగాలను నయం చేస్తుంది

ఈ ఆలయంలోని నీరు రోగాలను నయం చేసే అద్భుతం అని నమ్ముతారు. ఈ నీటిని శరీరంపై చల్లుకోవడం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు నయమవుతాయని చెబుతారు.

నత్తిగా మాట్లాడటం కూడా నయం!

పాషాన్ దేవి ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం కూడా ఉంది, ఈ ఆలయ నీటిని సేవించడం ద్వారా.. నత్తిగా మాట్లాడే వారు ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. నవరాత్రులలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.