Ayyappa Devotees: అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు.. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా

అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామీ మాలను ధరించి ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకుంటారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములు వివిధ పేర్లతో పిలుస్తారని మీకు తెలుసా? అవును.. సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు మాల ధరించేవారిని గురు స్వామి అంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం మాలధారణ చేసే స్వాములను రకరకాల పేర్లతో పిలుస్తారు.

Ayyappa Devotees: అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు.. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా
Ayyappa Devotees
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2024 | 7:41 PM

కార్తీక మాసం ప్రారంభం కావడంతో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు కనిపిస్తున్నారు. మరోవైపు కొందరు స్వాములు తమ మండల దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడితో శబరిమలకు పయణం అవుతున్నారు. అయ్యప్ప స్వామీ మాలధారణ చేసిన వారు నుదుట చందనం, తిలకంతో నల్ల దుస్తులు ధరించి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని 41 రోజుల పాటు పుజిస్తారు. మండల దీక్ష ను పూర్తి చేసుకుని దీక్ష అయ్యప్ప స్వామీ దర్శనానికి శబరిమల చేరుకుంటారు. కొంతమంది స్వాములు మండల దీక్ష, మరికొందరు అర్థ మండల దీక్షలు చేస్తారు. 41 రోజుల దీక్ష తర్వాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప పూజను పూర్తి చేసి అంతరం స్వామీ మాలను తీస్తారు. అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములకు వివిధ పేర్లు ఉన్నాయని తెలుసా.. అవును.. సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం అయ్యప్ప మాలను ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు ధరించేవారిని గురు స్వామి అంటారు. అయితే ప్రతి సంవత్సరం మాల వేసుకునే వారిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎక్కాల్సిన మెట్లు 18 అదే విధంగా అయ్యప్ప మాలను ధరించే స్వాములను 18 సార్లు ధరించే వారికీ ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు ఉంది.

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరములకు.. 18 పేర్లు

  1. సాధారణంగా మొదటి సారి దీక్ష తీసుకునే స్వామిని కన్నెస్వామి అంటారు.
  2. రెండోసారి మాల ధారణ చేసే స్వామిని కత్తిస్వామి అని సంబోధిస్తారు.
  3. మూడోసారి మాల వేసిన వారిని గంట స్వామి అంటారు.
  4. నాలుగోసారి మాల వేసుకుంటే గద స్వామి అంటారు.
  5. ఐదవ సారి స్వామి మాల వేసుకున్నవారిని విల్లు స్వామి అని పిలుస్తారు.
  6. ఆరవసారి మాల వేసిన స్వామిని జ్యోతి స్వామి అంటారు.
  7. ఏడవ సారి మాల వేసుకుంటే సూర్య స్వామి అని అంటారు
  8. ఎనిమిదవ సారి మాల వేసుకుంటే చంద్ర స్వామి అని అంటారు
  9. తొమ్మిదవ సారి అయ్యప్ప మాల వేసుకుంటే వేలు స్వామి
  10. పదవ సారి మాల ధారణ చేస్తే విష్ణు చక్ర స్వామి.
  11. పదకొండవ సారి అయ్యప్ప మాల ధరిస్తే శంఖాధార అని
  12. పన్నెండవ సారి మాల ధరిస్తే నాగాభరణ స్వామి అని అంటారు.
  13. పదమూడవ సారి స్వామి మాల వేసుకున్నవారు శ్రీహరి స్వామి
  14. పద్నాలుగో సారి స్వామి మాల వేసుకుంటే పద్మ స్వామి
  15. పదిహేనవ సారి మాల ధరిస్తే త్రిశూల స్వామి.
  16. పదహారవసారి సారి మాల ధరిస్తే శబరిగిరిస్వామి అని,
  17. పదిహేడవసారి మాల వేసుకున్న వారిని ఓంకార స్వామి అని
  18. ఎద్దేనిమిదవ సారి మాల వేసుకున్నవారిని నారికేళ స్వామి అని అంటారు.

అయితే అయ్యప్ప స్వామీ తన దర్శనం కోసం ఎప్పుడు కన్నె స్వామి రాడో అప్పుడు శాప విముక్తి అయిన మహిషిని పెళ్లి చేసుకుంటానని వరం ఇచ్చినట్లు పురాణాల కథనం.. ప్రతి ఏటా శబరీ శబరిమల వస్తుందని.. ఏటా మాలికాపురత్తమ్మ శబరిగిరికి వచ్చిన కన్నె స్వాములు శరం గుత్తిలో ఎరుమేలి నుంచి తెచ్చి గుచ్చిన బాణాలను చూసి నిరాశగా వెనుదిరిగుతుందని ఓ నమ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.