Ganesha Temple: పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..

హిందూ మతంలో వినాయకుడు ఆది పూజ్యుడు. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గణపతికి సంబందించిన అనేక రకాల ఆలయాలున్నాయి. అయితే మన దేశంలోని ఒక వినాయకుడి దేవాలయాన్ని సందర్శించడం వల్ల అవివాహితులకు వివాహ అవకాశాలు మెరుగవుతాయని చెబుతారు.

Ganesha Temple: పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..
Lord Ganesh Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2024 | 2:52 PM

హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. విఘ్నాలకధిపతి వినాయకుడిని పూజించడం చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. అందుకే గణేశుడిని అడ్డంకులను తొలగించే దైవంగా కొలుస్తారు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గణేశ దేవాలయాలు ఉన్నాయి. వాటి పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అలాంటి విశిష్టమైన గణపతి దేవాలయం ఒకటి రాజస్తాన్ లో ఉంది. ఇక్కడ వినాయకుడిని సందర్శిస్తే పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం. దీనితో పాటు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతర నమ్మకాలు ఉన్నాయి. ఆ గణపతి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.

ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే

ఈ పురాతన వినాయకుని ఆలయం రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బవాడి గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని గణేష్ బావాడి అంటారు. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ మెట్లబావి కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ వినాయకుడి విగ్రహం లభించిందని చెబుతారు. తరువాత స్థానిక ప్రజలు ఈ విగ్రహాన్ని ఒక వేదికపై ఉంచి పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా ఆలయాన్ని నిర్మించారు.

వివాహానికి ఆటంకాలు తొలగించే దైవం

అబ్బాయి లేదా అమ్మాయి వివాహం ఆలస్యం అవుతున్నా లేదా పెళ్లిళ్ల జరగడానికి ఏదైనా అడ్డంకి ఏర్పడినా ఇక్కడ వినాయకుడిని దర్శించుకుని పూజలు చేయడం వలన విశేష ఫలితలం ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా ఈ ఆలయంలో బుధవారం సూర్య చంద్రులను సమర్పించి.. పరిక్రమ చేస్తే వివాహ సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

సంతానం లేనివారికి సంతానం

ఎవరికైనా సంతానం కలగకపోతే ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది.

ఆలయంలో శివుడి విగ్రహం

గణేశుడితో పాటు శివుడి ఈ ఆలయంలో ముక్తేశ్వర మహాదేవుడిగా పూజలను అందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ప్రతిరోజు ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. నిత్యం ఇక్కడ పూజలు చేసే వ్యక్తికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని, దారిద్ర్యం తొలగిపోతుందని ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.