Vastu Tips: తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? ఈరోజే ఈ తప్పులను సరి చేసుకోండి

సాధారణంగా వాస్తు సంబంధిత తప్పులు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రతికూల శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుందని పేర్కొంది.

Vastu Tips: తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? ఈరోజే ఈ తప్పులను సరి చేసుకోండి
Vastu Tips For Health
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2024 | 4:09 PM

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా లేదా ఎల్లప్పుడూ అలసిపోతున్నారా? అలా అయితే ఇంట్లో వాస్తు సమస్య ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. సాధారణంగా.. పర్యావరణం వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా వాస్తు శాస్త్రాన్ని పట్టించుకోకుండా ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నా కూడా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తాయి. అందుకునే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రతికూల శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు శారీరక, మానసిక అనారోగ్యాలు అక్కడే కూర్చుంటాయి.

మంచాన్ని దక్షిణం వైపు ఉంచవద్దు

దక్షిణ దిక్కును యమ ధర్మ రాజు దిక్కుగా పరిగణిస్తారు. కనుక పొరపాటున కూడా దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోవద్దు. దక్షిణం వైపు పాదాలు ఉండేలా పడుకోవాలి. వాస్తు ప్రకారం దక్షిణ ముఖంగా తల పెట్టి పడుకోవడం వల్ల తలనొప్పి, కాళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే శరీరంలోని ఇతర భాగాలలో ఎల్లప్పుడూ నొప్పి అనుభూతి పొందుతారు.

కిటికీలు, తలుపులు మూసి ఉంచవద్దు

తలుపులు, కిటికీలు తెరిచి ఉంటే తాజా, చల్లని గాలి ఇంట్లోకి వస్తుంది. బయటి స్వచ్చమైన గాలిని ఇంట్లోకి రావడం వలన ఆరోగ్యంగా ఉంటారు. వెంటిలేషన్ కోసం ఎప్పుడూ తలుపులు ,కిటికీలు తెరచి ఉంచుకోవాలి. కనుక పొరపాటున కూడా కిటికీ, తలపులు ఎప్పుడూ మూసి ఉంచవద్దు. ఇలా చేయడం ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇవి కూడా చదవండి

సహజ కాంతి

ప్రస్తుతం ఇంట్లో ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకునే ట్రెండ్ పెరిగిపోయింది. చాలా మంది పగటి వేళలో కూడా ఇంట్లో సహజమైన కాంతి కంటే ఈ లైట్లను ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం గదిలోకి సహజ కాంతి ప్రవేశించడానికి వీలు ఉండడం లేదు. దాని కారణంగా ఎల్లప్పుడూ లైట్లు వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఎల్‌ఈడీ లైట్ల కాంతి ఎంత అందంగా ఉన్నా.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ఇంట్లో చెట్లు లేకపోవడం

ప్రస్తుతం ఇంటిని చాలా తక్కువ స్థలంలో నిర్మించుకుంటున్నారు. కనుక ఇంట్లో చెట్టును నాటడం చాలా కష్టం. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది వ్యక్తులు మొక్కలను ఇంటి లోపల ఉంచుకుంటారు. ఇంట్లో పచ్చదనం ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ఇంట్లో సులభంగా ఉంచుకోగల కొన్ని మొక్కలు ఉన్నాయి. గాలిని శుద్ధి చేసే మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ