Gemstone Rules: రత్నాలు అంటే ఇష్టమా.. ధరించే ముందు నియమం తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు
హిందూ మతంలో రత్నాల శాస్త్రం ప్రకారం రత్నాలను ధరించడానికి సంబంధించి అనేక రకాల నియమాలు ఇవ్వబడ్డాయి. ఇందులో ఏ రాశులకు చెందిన వ్యక్తులు ఏ తరహా రత్నాన్ని ధరించాలో సరైన నియమం పేర్కొన్నారు. ఈ నియమాలు పాటించకపోతే ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం..
అప్పుడు ఇప్పుడు అనే తేడా లేదు కొన్ని విషయాల్లో నమ్మకాలూ అలా కొనసాగుతూనే ఉన్నాయి.. ఉంటాయి కూడా.. అలాంటి నమ్మకమే ఒకటి చేతులకు ధరించే రత్నాలు. ఏ పనిలో విజయం దక్కడ పోయినా, కష్టాలు వెంటాడుతున్నా రత్నం ధరించడం ద్వారా విజయం దక్కుతుందని.. సమస్యలు అంతం అవుతాయని ఓ నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్న విధంగా రత్నం ధరిస్తే అతని అదృష్టం ప్రకాశిస్తుంది. అయితే ఈ రత్నాలను ధరించే ముందు రాశి, గ్రహ ప్రభావం వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని నమ్ముతారు, లేకపోతే దాని చెడు ప్రభావాలు ప్రజల జీవితాల్లో సమస్యలను సృష్టిస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక పరిష్కారాలు ఉన్నాయి. వీటిని అనుసరించినట్లయితే ఒక వ్యక్తి సమస్యలను, దోషాలను తొలగించవచ్చు. జాతకంలో గ్రహ దోషం ఉన్నప్పుడు రత్నానికి సంబంధించిన కొన్ని నివారణలు చర్యలు పాటించాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో రత్నాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ప్రతి రత్నం దాని సొంత శక్తిని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రత్నాన్ని ధరించే ముందు అది మీకు ప్రయోజనకరంగా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి నిపుణులకు చూపించి తెలుసుకోవాలి. వివిధ రత్నాలు వివిధ మార్గాల్లో జాతకాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అందువల్ల, రత్నాన్ని ధరించేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ రత్నాలను ధరించాలనుకుంటే శత్రువులుగా ఉన్న రాశులకు చెందిన రత్నాలను కలిపి దరించ రాదు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎవరైనా శత్రు రాశులకు సంబంధించిన రత్నాలను కలిపి ధరిస్తే అతను కష్టాలను, చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
శుభ సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
ఏ రకమైన రత్నాన్ని ధరించే ముందు శుభ సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ప్రతి రత్నాన్ని ధరించడానికి ఒక రోజు నిర్ణయించబడిందని పేర్కొన్నారు. దీనితో పాటు, రత్నాలను కొనుగోలు చేసేటప్పుడు శుభ సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక రత్నాన్ని కొనుగోలు చేసేటప్పుడు దానిపై ఎలాంటి మరకలు ఉండకూడదని లేదా అది పగిలిపోయి ఉండ కూడదు అని గుర్తుంచుకోండి.
ఏ రత్నం శుభప్రదం
ఎవరైనా రత్నాన్ని కొనుగోలు చేయబోతున్నట్లయితే.. రత్నాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిని రింగ్‌లో పొందుపరిచే ముందు అది మీకు శుభ ప్రదమో కాదో తెలుసుకోండి. రత్నం మీకు ప్రయోజనకరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి దానిని మీ దిండు కింద మూడు రోజులు ఉంచండి. ఈ మూడు రోజులు మీకు పీడకలలు రాకపోయినా, ఎలాంటి చెడు సంఘటనలు జరగకపోయినా, అలాంటి రత్నాన్ని ధరించడం వల్ల ఎలాంటి హాని ఉండదు.
రత్నం బరువుపై శ్రద్ధ వహించండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని బరువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రత్నాన్ని కొనుగోలు చేసేటప్పుడు రత్నాన్ని సగం కత్తిరించి కొనకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదు రత్నం జ్యోతిష్యులు సూచించిన విధంగా బరువు ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నించండి.
రత్నం ధరించే పద్ధతి
రత్నాన్ని ధరించబోతున్నట్లయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు దానిని తప్పనిసరిగా పూజించాలి. ఆ తర్వాత మీ ఇంట్లో పెద్దల పాదాలకు నమస్కారం చేసిన తర్వాత మాత్రమే ధరించాలని తెలుసుకోండి. రత్నం ఉన్న ఆభరణాలు అంటే ఉంగరం లేదా లాకెట్‌ను రత్నంతో చేయించుకుంటే పూజకు ముందు దానిని శుద్ధి చేసి, పాలలో వేసి అనంతరం శుభ్రమైన నీటితో కడగాలి. దీని తరువాత రత్నాన్ని సరిగ్గా శుభ్రం చేసి హవనం చేయండి. అప్పుడు రత్నాన్ని హవనం చుట్టూ 7 సార్లు తిప్పండి. దీని తర్వాత మాత్రమే ఏదైనా రత్నాన్ని ధరించండి. ఇలా చేయడం వలన రత్నం ధరించినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శుభ ఫలితాలను పొందవచ్చు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.