AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంచడం శుభప్రదం.. జీవితంలో ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులు తెలెత్తవు..

ప్రజలు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా విజయం సాధించలేరు. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి కష్టపడి ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలను పొందలేడు.

Vastu Tips: ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంచడం శుభప్రదం.. జీవితంలో ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులు తెలెత్తవు..
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Nov 18, 2024 | 4:34 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బు లేకుండా ఏ పని చేయలేం. అందుకనే ప్రజలు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు.. అయితే ఎంత కష్టపడినా కొన్ని సార్లు విజయం దక్కదు. అంతేకాదు కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా నిలవదు. ఇలా జరగడానికి వాస్తు దోషాలు కావచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే డబ్బు సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే ప్రజలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కష్టానికి తగిన ఫలితం దక్కదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తులు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్న ఇళ్లలో డబ్బు, ఆనందాన్ని పొందడంలో వివిధ రకాల అడ్డంకులు వస్తాయి. వాస్తు శాస్త్రంలో జీవితంలో ఆర్థిక లాభం, ఆనందం, శ్రేయస్సు పొందడానికి కొన్ని 5 చర్యలు పేర్కొన్నారు. వీటిని చేయడం ద్వారా ఆనందం, శ్రేయస్సులతో పాటు లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది.

ఏకాక్షి కొబ్బరి ఏకాక్షి కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. నమ్మకాల ప్రకారం ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ ఉన్న చోట వాస్తు దోషాలు ఉండవు. లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదు.

ఇవి కూడా చదవండి

గణపతి విగ్రహం హిందూ మతంలో గణపతి విఘ్నాధిపతి. అడ్డంకులను తొలగించేవాడుగా పుజిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న దోషాలను తొలగించడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. గణేశుడు సంపద,సంతోషం మార్గంలో వచ్చే ప్రతి రకమైన అడ్డంకులను తొలగిస్తాడు.

లక్ష్మి దేవి, కుబేరుడి ఫోటో హిందూ మతంలో లక్ష్మి దేవి, కుబేరులు సంపద , మంచి ఆదాయాన్ని ఇచ్చే దేవతలుగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో లక్ష్మీ దేవి,ర్డ్ కుబేరుడి చిత్రం ఉండాలి. సంపద పెరగాలంటే ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే క్రమం తప్పకుండా రోజూ పూజ చేయాలి.

వేణువు వాస్తు శాస్త్రంలో వాస్తుకు సంబంధించిన అన్ని రకాల లోపాలను తొలగించడానికి వేణువు చాలా ప్రభావవంతమైన పరిష్కారంగా పరిగణించబడుతుంది. వేణువు సానుకూలతకు చిహ్నం. అటువంటి పరిస్థితిలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇంట్లో వేణువును ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పూజ గదిలో వేణువును ఉంచడం వల్ల విద్య, వ్యాపారం, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు , సంపదలు లభిస్తాయి.

శంఖం శంఖానికి వాస్తు దోషాలను తొలగించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. నిత్యం శంఖం ఊదే చోట, చుట్టూ సానుకూలత ఉంటుంది. లక్ష్మీదేవికి శంఖం చాలా ప్రీతికరమైనది. శంఖం ఉన్న ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటుంది. శంఖం ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.