AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 2,3 గంటల్లోనే సర్వదర్శనం పూర్తి అయ్యేలా చర్యలు..

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించింది. అంతేకాదు ఇకపై గంటలకు గంటలు అంటే శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు, మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 2,3 గంటల్లోనే సర్వదర్శనం పూర్తి అయ్యేలా చర్యలు..
Tirumala By Walking
Surya Kala
|

Updated on: Nov 18, 2024 | 5:11 PM

Share

తిరుమలలో కొత్తగా ఏర్పడి టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్‌. నాయుడు వెల్లడిస్తూ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం సర్వ దర్శనంలో వెళ్ళే భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం చేసుకునే విధంగా సరికొత్త విధానం తీసుకుని రానున్నామని చెప్పారు. ఇకపై పవిత్ర క్షేత్రం తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం అని చెప్పారు. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతామని చెప్పారు. అంతేకాదు తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదన్నారు. తిరుమలలో శారదాపీఠం పూర్తిగా నిబంధనలు అతిక్రమించింది.. కనుక విశాఖ శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలాన్ని తిరిగి తీసుకుంటామని శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు బి.ఆర్‌.నాయుడు స్పష్టం చేశారు.

అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్‌ – శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ రద్దు

ఎప్పటి నుంచి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో ఇతర అన్యమతస్థులతో మాట్లాడినట్లు చెప్పారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని లేదా..వీఆర్‌ఎస్ ఇస్తాం అని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్లు.. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌ను ఆలయ ప్రధాన ఖాతాకే అనుసంధానం చేస్తామని వెల్లడించారు. మరోవైపు తిరుపతి ఫ్లైఓవర్‌ శ్రీనివాస సేతుకు గరుడ వారధి పేరు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్‌ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు హోటల్ కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. తిరుమల టూరిజం కేంద్రం కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పర్యాటకానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ రద్దు చేస్తున్నట్లు బీఆర్. నాయుడువెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..