AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: కొత్త ఏడాది 2025లో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశికి చెందిన వారికి వివాహ యోగం..

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శనిశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మ ప్రధాత.. జీవి చేసే మంచి చెడు కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు మంద గమనుడు. కనుక శనీశ్వరుడు ఒక్కోరాశిలో రెండున్నరేళ్లు ఉంటాడు. ఈ సమయంలో శనీశ్వరుడు రాశులపై మంచి, చెడు ప్రభావాన్ని చూపిస్తుంటాడు. ఇక 2025లో శనీశ్వరుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల పెళ్లి ప్రయత్నాలు ఫలించి వివాహం జరుగుతుంది.

Lord Shani: కొత్త ఏడాది 2025లో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశికి చెందిన వారికి వివాహ యోగం..
Lord Shaniswara
Surya Kala
|

Updated on: Nov 18, 2024 | 3:58 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు , రాశులకు , నవ గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాల్లో శనీశ్వరుడు కర్మ ప్రదాత. అత్యంత నెమ్మదిగా కదిలే శనీశ్వరుని సంచారానికి ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది అంటే 2025 మార్చి చివరి వారంలో శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశికి ప్రవేశించబోతున్నాడు. శనీశ్వరుడు మీన రాశికి ప్రవేశించడంతో మకర రాశికి చెందిన వారికి గత యేడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏలి నాటి శనీశ్వరుడి నుంచి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో మేష రాశికి చెందిన వ్యక్తులకు ఏడుయేళ్లు ఏలి నాటి శని ప్రభావం మొదలు కానుంది.

కుంభ రాశి: కొత్త ఏడాది 2025లో శనిశ్వరుడు మీన రాశి రాశిలోకి అడుగు పెట్టడం వలన ఈ కుంభరాశి వారు మరో రెండున్నరేళ్లు ఏలి నాటి శని దశ నడుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు ఆర్ధిక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ఫలితం దక్కదు. నిరసజనంగా ఉంటారు. అంతేకాదు శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.

మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనిశ్వరుడి సంచారము వలన ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది. కనుక ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అప్పులు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆందోళన కలిగి.. శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు శని ప్రభావం నుంచి ఉపశమనం కోసం ప్రతి శనివారం, శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి నల్ల నువ్వులతో పూజా, నల్ల నువ్వుల నూనే తో తైలాభిభిషేకం చేయడం మంచిది. ఈ పరిహారాలు చేయడం వలన శని ప్రభావం నుంచి కొంత మేర ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీన రాశి: ఈ రాశి వారికీ శనీశ్వరుడి సంచారం వలన ఏలి నాటి ప్రభావం చూపనుంది. మరో ఐదేళ్లు వరకు ఏలి నాటి శని ప్రభావంతో ఇబ్బందులు కలగనున్నాయి. అంతేకాదు చేపట్టిన ప్రతి పనిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేస్తున్న పనిలో లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కలగవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల వివాహా ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.

ఏలి నాటి శని నుంచి విముక్తి కోసం చేయాల్సిన పరిహారాలు: ప్రతి శనివారం శనిశ్వరుడిని పూజించండి. బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. పేదలకు అన్న వితరణ చేయండి. శనివారం రోజున చీమలకు ఆహారం అందిస్తే శని ప్రభావం నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. శనిశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం హనుమంతుడిని పూజించండి. శనివారం రోజున 11 సార్లు శని స్తోత్ర పారాయణం చేయడం వలన జాతకంలో శని ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్