Masa Shivaratri: వివాహం జాప్యమా.. కోరుకున్న వరుడి కోసం మాస శివరాత్రి రోజున ఇలా పూజ చేయండి..

మస శివరాత్రి రోజు శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. పెళ్లికాని ఆడపిల్లలు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. శివయ్య అనుగ్రహంతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు.

Masa Shivaratri: వివాహం జాప్యమా.. కోరుకున్న వరుడి కోసం మాస శివరాత్రి రోజున ఇలా పూజ చేయండి..
Masa Shivratri 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2024 | 2:42 PM

హిందూ మతంలో మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నేరవేరతాయని నమ్మకం. నెలవారీ శివరాత్రి రోజున నిర్మలమైన హృదయంతో శివుడిని పూజించే వ్యక్తి కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. జీవితంలో ఆనందాన్ని , అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. శివుని అనుగ్రహంతో పెళ్లికాని ఆడపిల్లలకు కూడా కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడని నమ్మకం.

హిందూ పంచాంగం ప్రకారం మాస శివరాత్రి కార్తీక మాసంలోని మాసం లోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నవంబర్ 29వ తేదీ ఉదయం 8:39 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే నవంబర్ 30వ తేదీ ఉదయం 10:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో కార్తీక మాస శివరాత్రిని 29 నవంబర్ 2024న జరుపుకుంటారు. ఎందుకంటే శివరాత్రి పూజను రాత్రి సమయంలో చేస్తారు.

శివయ్య అనుగ్రహం కోసం ఎలా పుజించాలంటే

  1. మాస శివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసం, పంచామృతం, పచ్చి పాలు, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం చేయండి.
  2. పూజ సమయంలో శివలింగానికి పూలు, బిల్వపత్రం, ఉమ్మెత్త, భస్మం, చందనం మొదలైన వాటిని సమర్పించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. పూజ సమయంలో శివయ్య అనుగ్రహం కోసం అర్గల స్తోత్రం, శివ తాండవ స్తోత్రం, శివ పురాణం, శివ అష్టకం, శివ చాలీసా పఠించండి.
  5. శివుడికి పాయసం, స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.
  6. జమ్మి చెట్టు ముందు సుఖశాంతులు కలగాలని ప్రార్థించండి.
  7. పార్వతి దేవికి పసుపు కుంకుమలు సమర్పించి, ‘ఓం సృష్టికర్త మమ వివాహం కురు కురు స్వాహా’ అనే మంత్రాన్ని జపించండి.
  8. పేదలకు, ఆపన్నులకు , బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది

మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. బిల్వ పత్రాలు శివునికి చాలా ప్రీతికరమైనవి. జలంతో అబిషేకం చేసి.. బిల్వ పత్రాన్ని సమర్పించినా శివుడు సంతోషిస్తాడు. పేదలకు అన్నదానం చేయడం శివుని ప్రసన్నం అవుతాడు. మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివుడిని పూజించండి.

వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలంటే

మంత్రం పఠించడం: “ఓం సృష్టికర్త మం వివాహ కురు కురు స్వాహా” ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. శివ పార్వతులను పూజించడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. పార్వతీ దేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి, కోరుకున్న జీవిత భాగస్వామిని ఆనుగ్రహించమని ఆమెను ప్రార్థించండి. ఈ పరిహారాలను అనుసరించడం ద్వారా శివుడు మీ కోరికలన్నింటినీ తీరుస్తాడు . వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి.

మాస శివరాత్రి ప్రాముఖ్యత

ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే మాస శివరాత్రి రోజున కూడా కొన్ని పరిహారాలు చేయవచ్చు ఎందుకంటే మాస శివరాత్రి ఉపవాసం పాటించడం ద్వారా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. పంచామృతంతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె. పంచదార) శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు నశించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాదు ఆవు పాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?