హిందూ పురాణాలలో కామదేనుకి విశిష్ట స్థానం ఉంది. కామధేను సమృద్ధి, శ్రేయస్సు, విజయానికి పవిత్ర చిహ్నం. కామధేనువు సంపద, శ్రేయస్సు, ఆనందం , శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ప్రజలు కామధేను ఆవు విగ్రహాన్ని తమ కార్యాలయంలో, దుకాణంలో లేదా డబ్బు ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటున్నారు. అయితే కామధేను ఆవు దూడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. ఈ వాస్తు ప్రకారం కామధేను ఆవు విగ్రహాన్ని ఆఫీసులు లేదా దుకాణాలు కాకుండా ఇంట్లో ఉంచాలా వద్దా ఒకవేళ ఇంట్లో విగ్రహం పెట్టుకోవాలంటే వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..