కార్తీక మాసంలో తెరచుకున్న సంతాన గుహలు.. ఇక్కడ నిద్ర చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత, ఒక్కో ఆలయంలో ఒక్కో ఆచారం మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి వాటిలో ఒకటే సంతాన గుహలు. ఇవి ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఉన్నాయి. ఈ గుహలను ఆంధ్రా అజంతా గుహలుగా పిలుస్తారు. వాడుక బాషలో బౌద్ద గుహలు. ఐతే వీటికి సంతాన గుహలు అని ఎందుకు పేరు వచ్చింది. అంటే అక్కడ పిల్లలకోసం పానాసారం పడతారు మహిళలు. అంటే తడి బట్టలతో గుహ ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తూ నిద్రపోతారు. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ ప్రాంతంలో ప్రభలంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆగుహలోపల ఏముందో తెలుసుకుందాం..

B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Nov 22, 2024 | 4:25 PM

చరిత్ర ప్రకారం ఈ గుహలకు చాలా ప్రాముఖ్యత ఉంది. బౌద్ధ భిక్షువులు ఆ గుహలలో నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. మూడవ శతాబ్దంలో అక్కడ బౌద్ధ బిక్షకులు జీవించారని చరిత్ర చెబుతుంది. అందుకే ఇది ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా కూడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పురావస్తు శాఖ అధినంలో ఉంది ఈ ప్రాంతం. ఓ పక్క పర్యాటక ప్రదేశంగా ఉంటూ మరోపక్క ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఆ గుహలు పిలవబడుతున్నాయి.

1 / 7
ఆ గుహల వద్ద మహిళలు నిద్ర చేస్తే వారికి సంతాన యోగం కలుగుతుందని నమ్మకం. ఆ నమ్మకం ఎందుకు ఏర్పడింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కడ సువిశాల సుందరమైన కొండలు గదులుగా చెక్కబడిన నిర్మాణాలు ఉంటాయి. వాటిని జీలకర్రగూడెం గుహలు లేదా గుంటుపల్లి గుహలు అని పిలుస్తారు.

2 / 7

ఆ గుహలలో ఓ గుహలో గుండ్రటి ఆకారంలో ఓ పెద్ద గోళం కనిపిస్తుంది. ఇది శివలింగాకారంలో ఉంటుంది. దీనిని భక్తులు ధర్మ లింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో గుంటుపల్లి గుహలకు పర్యాటకులు భక్తులు వేల సంఖ్యలో వచ్చి  ధర్మలింగేశ్వర స్వామిని దర్శించి, ఇక్కడున్న గుహలను, బౌద్ధ భిక్షువులు నిర్మించిన నిర్మాణాలను తిలకిస్తారు.

3 / 7
 ముఖ్యంగా కార్తీకమాసంలో సోమవారాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సోమవారం రోజున ధర్మలింగేశ్వరస్వామిని దర్శించేందుకు భక్తులు అక్కడికి చేరుకుంటారు. ధర్మ లింగేశ్వర స్వామి ముందు నిద్ర చేస్తే సంతానం లేని మహిళలకు సంతానయోగం కలుగుతుందని నమ్మకం.

4 / 7
ముందుగా మహిళలు తలస్నానమాచరించి, తడి బట్టలతో మెట్ల మార్గం ద్వారా ధర్మ లింగేశ్వర స్వామి వద్దకు చేరుకుని చుట్టూ ప్రదక్షిణలు చేసి గుహ బయట స్వామిని వేడుకుంటూ నిద్ర చేస్తారు. నిద్ర చేస్తున్న మహిళల స్వప్నంలోకి పళ్ళు, పువ్వులు కనిపిస్తే వారికి తప్పకుండా సంతానయోగం కలుగుతుందని అక్కడికి వచ్చే మహిళల నమ్మకం. దీనినే పానాసారం అంటారు. అక్కడ ధర్మ లింగేశ్వర స్వామి తో పాటు సువిశాల ఎత్తయిన కొండలో పచ్చని ప్రకృతితో అలలారుతుంది.

5 / 7
కొండ యావత్తు గదులుగా చెక్కబడి ఉంటాయి. అక్కడ గుహలలోని ఇసుక రాతిలో చెక్కబడిన ఐదు గదుల సముదాయంతో పాటు ఆ కాలంలో వాడిన ఉపకరణాలు సైతం అక్కడ మనకు కనిపిస్తాయి. అంతేగాక ఆ గదిలలో వర్షపు నీరు బయటకు పోవడానికి ప్రత్యేకంగా కాలువలు కూడా త్రవ్విన దృశ్యాలు మనం అక్కడ చూడవచ్చు. అలాగే కొండపైన పెద్దన రాతితో నిర్మితమైన అనేక గుండ్రటి ఆకారంలో స్థూపాలు, బౌద్ధ బిక్షువులు నిర్మించిన మందిరం, ఓ పెద్ద పాదం ఆకారంలో ఉన్న లోతైన నిర్మాణాన్ని భీముని పాదంగా అక్కడికి వచ్చిన పర్యాటకులు పిలుస్తారు.

6 / 7
 ఇలా అక్కడ కొండపై ఎన్నో రకాల చారిత్రక నిర్మాణాలు మనం చూడవచ్చు. అయితే అక్కడికి వచ్చిన పర్యాటకుల కోసం సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉండే ఈ గుహలు సాదారణ రోజులల్లో కేవలం పర్యాటకులు మాత్రమే అక్కడికి వెళ్తారు.

7 / 7
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ