- Telugu News Photo Gallery Spiritual photos Weekly horoscope 24th november 2024 to 30 november 2024 check astrological predictions of all zodiac signs in telugu
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (నవంబర్ 24 నుంచి 30, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయ ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయవంతం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
Updated on: Nov 24, 2024 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి ఈ వారమంతా గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కూడా వసూలవుతుంది. గురు, శుక్రుల పరివర్తన వల్ల అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బాగా ఇష్టమైన దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగు తుంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. తరచూ గణపతికి అర్చన చేయించడం చాలా మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి లాభస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. కుటుంబ సభ్యులతో దైవకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్కంద స్తోత్రం పఠించడం వల్ల ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): సాధారణంగా ధనాదాయానికి లోటుండదు. ధన స్థానంలో కుజుడు ఉన్నందువల్ల రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందరపాటు వల్ల ఇబ్బం దిపడే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగాలకు ఆఫర్లు అందు తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ శివ స్తోత్రం పఠించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో సంచారం చేస్తున్న గురువు కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. సాధారణంగా ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తు తాయి. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. దుర్గాదేవీని స్తుతించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొన్ని వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దశమ స్థానంలో శుభ గ్రహాల దృష్టులు కేంద్రీకృతం కావడం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. సాధారణంగా వారమంతా సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆర్థి కంగా మంచి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల సలహాలు, సూచనల మీద ఆధారపడకపోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవ కాశం ఉంది. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ప్రతి రోజూ ఆదిత్య హృదయ పఠనం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయపరంగా ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది శ్రమతో పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించినంతగా కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుండదు. వ్యాపారాల్లో మీ ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. దూరపు బంధువు లతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంవల్ల రాహు కేతువుల దోషం తొలగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ధన స్థానంలో రవి బుధులు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల వృత్తి ఉద్యో గాల్లో ఆదాయపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువుల్లోనే సంబంధం కుదురుతుంది. మిత్రుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. దుర్గాదేవి స్తోత్ర పఠనం వల్ల విజయాలు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ధన, సప్తమాధిపతుల పరివర్తన కారణంగా ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొందరు బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. విలాస జీవితం గడుపు తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సాన్ని హిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ఖర్చు పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవు తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వ్యయ స్థానంలోని శుక్ర గ్రహం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల్లో కొందరు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవ కాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపా రాలు కొద్ది లాభాలతో సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యో గంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కాలభైరవాష్టకం పఠించడం వల్ల వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి చతుర్థ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఆదాయానికి లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్య అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహా రాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): భాగ్య స్థానంలో సంచరిస్తున్న బుధ, రవుల కారణంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహా రాలు సాదా సీదాగా సాగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల రాహు కేతువుల దోషం తగ్గుతుంది.



