ఉల్లిపాయలను, వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. అయితే హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఈ వెల్లుల్లి, ఉల్లిపాయలను తామసిక ఆహారంగా వర్గీకరించారు. మనస్సులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని పెంచుతాయని .. వీటిని తినడం వలన శృంగార కోరికలను పెంచుతాయని చెబుతుంటారు. వీటిని రజోగుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు. అంటే విపరీతమైన కోరికలను కలిగిస్తాయని అర్ధం. అందుకనే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజ సమయంలో లేదా వివిధ వ్రతాలూ, శుభకార్యాల సమయంలో వెల్లుల్లి , ఉల్లిపాయలను తినడం నిషేధించబడింది. వెల్లుల్లి, ఉల్లిపాయలు రాహు మరియు కేతువులకు సంబంధించినవి. ఉపవాసం లేదా పూజ సమయంలో తామసిక ఆహారాన్ని తినరు. తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదు అని నమ్మకం.