AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Batuk Bhairava: ఇక్కడ బాలుడి రూపంలో శివయ్యకు పూజలు.. చాక్లెట్స్, బిస్కెట్స్ ప్రసాదాలు..

భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం.. అనేక ఆలయలు, పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అయితే కొండ కోనల్లో సహా అనేక ప్రాంతాల్లో శివాలయాలు ఉన్నాయి. అనేక మిస్టరీ శివాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఒక దేవాలయంలో శివుడు చిన్న పిల్లాడు.. అంటే బాలుడి రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అంతే కాదు ఇక్కడ దేవుడికి చిన్నపిల్లాడిలా టాఫీ, చాక్లెట్, బిస్కెట్లు కూడా అందజేస్తారు.

Batuk Bhairava: ఇక్కడ బాలుడి రూపంలో శివయ్యకు పూజలు.. చాక్లెట్స్, బిస్కెట్స్ ప్రసాదాలు..
Batuk Bhairava Mandir In Varanasi
Surya Kala
|

Updated on: Nov 25, 2024 | 8:48 AM

Share

శివుడికి ఇష్టం అంటూ శివాలయాల్లో పూజ చేసే సమయంలో మాత్రమే కాదు ఇంట్లో శివుడికి పూజ చేసినా బిల్వ పత్రాలు, ఆవు పాలు వంటి వాటిని సమర్పిస్తారు. అయితే ఒక ప్రత్యేకమైన శివాలయంలో మాత్రమం శివుడికి టాఫీ, బిస్కెట్లు, నమ్‌కీన్, చాక్లెట్ మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ దేవుడికి వీటిని నైవేద్యంగా పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దీనితో పాటు భక్తుడు కోరిన అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ ఆలయం ఎక్కడ ఉందో .. దానికి సంబంధించిన నమ్మకాలను గురించి తెలుసుకుందాం.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఈ విశిష్టమైన మహాదేవుడి ఆలయం వారణాసిలో ఉంది. అత్యంత పురాతన నగరం భూతల కైలాసం అని పిలుస్తారు. కాశీ ని దేవాలయాల నగరం అంటారు. నిజానికి ఈ నగరంలో అడుగడుగునా శివుడు ఉన్నాడు. అంతేకాదు ఈ నగరంలో శివుడి ఆలయాలతో పాటు అనేక ఇతర దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కమ్చాలో ఉన్న బతుక్ భైరవ దేవాలయం. బతుకు భైరవ ఆలయంలో శివుడు బాల రూపంలో పూజలను అందుకుంటున్నాడు.

చాక్లెట్‌లు, బిస్కెట్‌లను ప్రసాదంగా

ఈ ఆలయంలో శివుడిని బతుకు భైరవుడిగా పూజిస్తారు. ఇందులో బతుకు అంటే పిల్లవాడు అని అర్ధం. కాశీలోని బతుక్ భైరవుని వయస్సు 5 సంవత్సరాలు. తల్లిదండ్రులు తమ పిల్లవాడిని ఎంతగా ప్రేమగా చూసుకుంటారో.. అలాగే ఈ దేవాలయానికి వచ్చే భక్తులు బతుకు భైరవుడిని చూసుకుంటారు. బాల శివయ్యకు టాఫీ, చాక్లెట్, బిస్కెట్లు వగైరా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

కష్టాలు దూరమవుతాయి

బతుకు భైరవుని దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని రకాల శారీరక, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. అంతే కాదు జాతకంలో రాహు, కేతువుల బాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇదొక్కటే కాదు దర్శనంతోనే చేపట్టిన పనుల్లో వచ్చిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.

ఈ విషయాలు కూడా అమోఘంగా అనిపిస్తాయి

బతుకు భైరవ దేవాలయంలో భగవంతుడికి బిస్కెట్లు, స్నాక్స్, చాక్లెట్లు, లడ్డూలు వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం మహా హారతి అనంతరం మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఆమ్లెట్‌తో పాటు భైరవుడికి మద్యం అందజేస్తారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.