AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi AP Tour: ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 29 న విశాఖలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు తగిన విధంగా భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు.

PM Modi AP Tour: ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Pm Modi Ap Tour
Surya Kala
|

Updated on: Nov 25, 2024 | 6:57 AM

Share

దేశానికి మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోడీ.. ఏపీలో తొలిసారిగా అడుగు పెట్టనున్నారు. ఈ నెల 29న విశాఖకు రానున్నారు. మోడీ పర్యాటన నేపధ్యంలో విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అంతేకాదు ఏపీవాసుల పదేళ్ల కల నెరవేర్చే విధంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ.. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3. 40 గంటల విశాఖ ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్శిటీ కాలేజ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర ప్రధాని రోడ్ షో ని నిర్వహించనున్నారు. ఏయూ సభా వేదిక నుంచే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు పలువురు కూటమి మంత్రులు పాల్గొంటారు.

సుమారు 85వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 25వేల మందికి ఉపాధి లభించడంతో పాటు విశాఖ ప్రతిష్ఠ మరింత పెరగనుంది. విశాఖను గ్రోత్‌ హబ్‌గా ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు.. ఏపీ ప్రజలను పదేళ్లుగా ఊరిస్తున్న రైల్వే జోన్‌కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించబడింది. అయితే ఏపీ విభజనకు పదేళ్లు పూర్తయినా జోన్‌పై ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎటువంటి కార్యాచరణ జరగలేదు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విశాఖ రైల్వే జోన్‌ అంశంపై కదలిక రావడంతో పాటు భూములు కూడా కేటాయింపు జరిగింది. దీంతో విశాఖ టూర్‌లో రైల్వే జోన్‌కు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ప్రధాని తన పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారీ బహిరంగ సభలో ఏపీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ తో పాటు రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాజెక్టు లకు సంబంధించిన అంశాలను ప్రధాని ప్రసంగం లో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభ అనంతరం ఐ ఎన్ ఎస్ డేగా చేరుకుని తిరిగి దిల్లీకి ప్రధాని పయనం అవుతారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ప్రభుత్వం భారీ భద్రతల ఆమధ్య ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అలెర్ట్‌ అయింది. మోడీ టూర్‌కు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లును పరిశీలించారు విశాఖ కలెక్టర్. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..