Utpanna Ekadashi: రేపే ఏకాదశి పుట్టిన రోజు ఉత్పన్న ఏకాదశి.. ఈ శుభ యోగంలో పూజిస్తే గోదానం చేసిన ఫలితం..

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజు వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారు. పాపాలు నశిస్తాయి. అంతేకాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి.

Utpanna Ekadashi: రేపే ఏకాదశి పుట్టిన రోజు ఉత్పన్న ఏకాదశి.. ఈ శుభ యోగంలో పూజిస్తే గోదానం చేసిన ఫలితం..
Utpanna Ekadashi Puja
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2024 | 9:07 AM

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్పన్న ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా.. మోక్షం లభిస్తుందని.. వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని నమ్మకం. అనేక జన్మల పాపాలు నశిస్తాయి. అలాగే విష్ణువు ఆశీర్వాదం ఇంట్లోని ప్రజలందరికీ ఉంటుంది. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తారు.

హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1:01 గంటలకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26 న జరుపుకుంటారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఉపవాస దీక్షను విరమించే సమయం ఉంటుంది.

ఉత్పన్న ఏకాదశి శుభ యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా ప్రీతి యోగం ఏర్పడుతోంది. దీని తరువాత ఆయుష్మాన్ యోగా, శివవాస్ యోగా కూడా ఏర్పడనున్నాయి. వీటిలో లక్ష్మీ నారాయణుడిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. కుటుంబంలో సుఖ, సంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతి యోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2:14 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇది మర్నాడు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 గంటల నుంచి 6:54 గంటల వరకు ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి రోజున హస్తా నక్షత్రం నవంబర్ 27 ఉదయం నుంచి 4.35 వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం వస్తుంది.

ఉత్పన ఏకాదశి పూజా విధానం

  1. ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా శంఖం ఊది స్నానం చేయాలి.
  2. శ్రీ మహా విష్ణువును ధ్యానించండి. స్మృతి చేయండి.
  3. శ్రీ మహా విష్ణువు విగ్రహానికి పంచామృతంతో స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు ధరించండి.
  4. శ్రీ మహా విష్ణువును చందనం, పసుపు, అక్షతలతో అలంకరించి పుష్పాలను సమర్పించాలి.
  5. ధూపం, దీపం వెలిగించి దేవుడికి సమర్పించాలి.
  6. భగవంతునికి హారతి ఇచ్చి శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపించండి.

ఉత్పన ఏకాదశి ఉపవాస విరమణ సమయం

నవంబరు 26న ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే.. మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఎప్పుడైనా ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉత్పన్న ఏకాదశి విరమణ సమయం రోజున హరి వాసర ముగింపు సమయం ఉదయం 10.26.

ఉత్పన ఏకాదశి ప్రాముఖ్యత

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి పండుగ సందర్భంగా గృహాలు, దేవాలయాలలో నారాయణుడు, లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడు గోదానానికి సమానమైన ఫలితాలను పొందుతాడు. ఈ రోజు ఆచారాల ప్రకారం పూజిస్తే శ్రీ మహా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులకు ఉంటుంది. జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎప్పుడూ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అని ఓ నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.