AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. విజన్ డాక్యుమెంటుతో మరింత ఆధ్యాత్మిక శోభ

ఆధ్యాత్మిక క్షేత్రం మోడల్ టౌన్ గా మారబోతోంది. విజన్ డాక్యుమెంట్ తో ధార్మిక క్షేత్రం ఇకపై ప్రణాళిక బద్దంగా రూపుదిద్దు కోబోతోంది. ఈ మేరకు తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు కాబోతోంది. సీఎం ఆదేశంతో తిరుమల క్షేత్రం మరింత ఆధ్యాత్మికత ఉట్టి పడేలా దర్శనమివ్వబోతోంది.

Tirumala: తిరుమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. విజన్ డాక్యుమెంటుతో మరింత ఆధ్యాత్మిక శోభ
Tirumala Rush
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Nov 25, 2024 | 10:02 AM

Share

తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం కాబోతోంది. ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడే అజెండాతో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా అది జరగకపోగా తిరుమల అభివృద్ధికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ను అమలు అవసరం ఉందని చెబుతోంది కూటమి ప్రభుత్వం. 2019లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్ గురించి ఎవరికి తెలియని పరిస్థితి ఉందని చెబుతున్న టీటీడీ ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదని చెబుతోంది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదంటున్న టీటీడీ.. ఇక నుంచి తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామంటోంది టీటీడీ. తిరుమలలో మల్టిలెవల్, స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ లు నిర్మాణం చేయనుంది. బాలాజీ బస్టాండ్ ను మరో చోటకు తరలించనుంది.

ఇక తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం అంటున్న టీటీడీ యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. 2019లో ఐఐటి నిపుణులు తిరుమలకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాకపోగా కూటమి ప్రభుత్వం విజన్ డాక్యుమెంటు తో తిరుమల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మాస్టర్ ప్లాన్ లోని ముఖ్య అంశాలను ఆచరణలో పెట్టబోతోంది. హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను ప్రణాళికాబద్దమైన డిజైన్లతో రూపొందించనున్నట్లు ప్రకటించింది. టీటీడీలో అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌ లు, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని గుర్తించింది. పాత కాటేజీలను తొలగించి మరో 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించిన టీటీడీ ఈ మేరకు మౌళిక సదుపాయాలను రూపొందించే ఆలోచన చేస్తోంది. టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ లను సలహాదారుగా నియమించుకుని తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత ఉండేలా అభివృద్ధి చేయబోతోంది. దాతలు నిర్మించే కాటేజీలకు సొంత పేర్లు కాకుండా టీటీడీ సూచించే పేర్లలో కాటేజీలకు పెట్టేలా దాతలు సహకరించాలని టీటీడీ బోర్డు కోరుతోంది. మరోవైపు తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను రెండు, మూడు నెలల్లో తొలగిస్తామని చెబుతోన్న టీటీడీ తిరుమలకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతిమ లక్ష్యంగా టీటీడీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..