AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darsh Amavasya: దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి

దర్శ అమావాస్య హిందూ మతంలో ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి దేవతలను పూజిస్తారు. దర్శ అమావాస్య రాత్రి కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా.. అన్ని దుఃఖాల నుంచి ఉపశమనం పొంది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది అని నమ్ముతారు.

Darsh Amavasya: దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
Darsh Amavasya 2024
Surya Kala
|

Updated on: Nov 27, 2024 | 6:57 AM

Share

దర్శ అమావాస్యను అమావాస్య తిధికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. జీవితంలో ఇబ్బంది పడుతుంటే దర్శ అమావాస్య రాత్రి కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ కష్టాలను తొలగించుకోవచ్చు. దర్శ అమావాస్య రాత్రి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. దర్శ అమావాస్య రాత్రి సరైన చర్యలు తీసుకుంటే వారు ఖచ్చితంగా తమ పనిలో విజయం సాధిస్తారు. జీవితంలోని అన్ని కష్టాల నుంచి పరిష్కరిస్తారు. దీనితో పాటు పూర్వీకుల ఆశీస్సులు అందుకుంటారు.

దృక్ పంచాంగం ప్రకారం కార్తీకమాసం దర్శ అమావాస్య తిథి నవంబర్ 30 ఉదయం 10.29 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథి ప్రకారం దర్శ అమావాస్యను నవంబర్ 30వ తేదీ శనివారం మాత్రమే జరుపుకుంటారు. ఎందుకంటే అమావాస్య రాత్రి ఆరాధిస్తారు.

దర్శ అమావాస్య రాత్రి చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే

  1. దర్శ అమావాస్య రాత్రి రావి చెట్టు క్రింద ఆవాల నూనెతో దీపం వెలిగించి కోరికలు నెరవేరాలని ప్రార్థించండి.
  2. దర్శ అమావాస్య సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి నదిలో లేదా చెరువులో విడిచి పెట్టాలి. దీంతో పూర్వీకులకు శాంతి చేకూరి వారి ఆశీస్సులు లభిస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. రాత్రి సమయంలో శివలింగానికి జలం సమర్పించి బిల్వ పత్రాన్ని సమర్పించి శివుడిని పూజించాలి. దీంతో భోలే నాధుడి ప్రత్యేక ఆశీస్సులు ప్రజలపై కురుస్తున్నాయి.
  5. అమావాస్య రాత్రి లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సంపదలు చేకూరే అవకాశాలు ఏర్పడతాయి. విష్ణువును పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.
  6. గణేశుడిని ఆరాధించడం ద్వారా చేపట్టిన అన్ని పనులలో విజయం పొందుతారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి జరగడం మొదలవుతాయి. అదే సమయంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి.
  7. అమావాస్య రోజు దానం చేయడం చాలా పుణ్య కార్యంగా భావిస్తారు. శక్తి మేరకు పేదలకు ఆహారం, బట్టలు మొదలైన వాటిని దానం చేయవచ్చు.
  8. ఆవుకు ఆహారం అందించడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. ఆవును దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన పుణ్యఫలితాలను పొందుతారు.
  9. అమావాస్య రోజున ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరం. దీంతో మనసుకు ప్రశాంతత లభించి రోజు చక్కగా సాగుతుంది.

దర్శ అమావాస్య ప్రాముఖ్యత

దర్శ అమావాస్యను ఛోటీ అమావాస్య అని కూడా అంటారు. దర్శ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకోవడానికి..వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి అంకితం చేయబడింది. ఈ పరిహారాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సును కూడా పొందుతారు. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దర్శ అమావాస్య రోజున విధివిధానాల ప్రకారం పూజలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్ష మార్గం సులభతరం అవడంతో పాటు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.