Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్‌.. గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఈ వీడియోకి ఇప్పటివరకు 90000 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. బ్రదర్‌ ఈ టీ తాగడానికి ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉందా అంటూ ఒకరు అడిగితే, బాబోయ్‌ ఇంత ఖరీదైన ఛాయ్ నేను కలలో కూడా ఊహించలేదని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

Viral Video: బాబోయ్‌.. గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Golden Tea
Jyothi Gadda
|

Updated on: Nov 26, 2024 | 8:17 PM

Share

ఉదయం లేవగానే చాలా మందికి కామన్ గా ఉండే అలవాటు టీ తాగడం లేదంటే… కాఫీ తాగడం లాంటివి చేస్తారు. ఈ రెండు పనులు చేయకుండా చాలా మందికి వారి రోజు మొదలుకాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే భారతదేశానికి టీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం టీ మాత్రమే కాదు, సామాజిక పరస్పర చర్య, సంబంధాలను బలోపేతం చేసే సాధనం. మన ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా మనం ఎవరి ఇంటికి వెళ్లినా ముందుగా మనల్ని ఆహ్వానించేది టీ. మనదేశంలో రూ.5, 10 రూపాయలు మొదలుకొని వందలు వేల ధరల్లో కూడా ఈ టీ లభిస్తుంది. అత్యంత ఖరీదైన టీ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టీ ధర రూ.700 నుండి రూ.750 వరకు ఉంటుందని తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. అయితే దుబాయ్‌లో ఒక టీ ఖరీదు తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! దాని ధర అక్షరాల లక్ష రూపాయలట.. అలాంటి ఛాయ్ స్పెషల్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

దుబాయ్‌లోని ఓ కేఫ్‌లో 24 క్యారెట్ల గోల్డ్ టీ లభిస్తుంది. DIFCలోని ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్‌లో ఉన్న బోహో కేఫ్‌లో ఇంత ఖరీదైన టీ విక్రయిస్తున్నారు. దీనిని భారతీయ సంతతికి చెందిన సుచేతా శర్మ అనే మహిళ నడుపుతున్నారు. ఈ కేఫ్‌లో 24 క్యారెట్ల గోల్డ్ లీఫ్‌తో అందించే ‘గోల్డ్ కడక్’ టీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌నెట్‌లో ఇటీవల ఒక వైరల్ వీడియో కనిపించింది. దీనిలో ఫుడ్ వ్లాగర్ కేఫ్-రెస్టారెంట్, దాని అత్యంత ఖరీదైన టీ గురించి చెబుతోంది. బంగారు పౌడర్‌, బంగారు రేకులతో కవర్‌ చేసి ఉంచిన స్వచ్ఛమైన వెండి కప్పుసాసర్‌లో ఈ టీ ని సర్వ్‌ చేస్తారని వ్లాగర్ వివరించాడు.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Gulf Buzz (@gulfbuzz)

ఇకపోతే, ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 90000 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. బ్రదర్‌ ఈ టీ తాగడానికి ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉందా అంటూ ఒకరు అడిగితే, బాబోయ్‌ ఇంత ఖరీదైన ఛాయ్ నేను కలలో కూడా ఊహించలేదని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..