స్వాతంత్ర్య పోరాట కాలం నాటి వంతెన.. నదిలో కుప్పకూలింది..! దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
వంతెనకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని సంరక్షించి, అందమైన పరిరక్షణ పనులు చేసి, వారసత్వ సంపదగా భవిష్యత్తులో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే వంతెనలో కొంత భాగం 80 అడుగుల మేర కూలిపోయి నదీ జలాల్లో మునిగిపోయింది.
కాన్పూర్‌లోని 150 సంవత్సరాల పురాతన వంతెన కుప్పకూలింది. స్వాతంత్ర్య పోరాట కాలం నాటి ఈ వంతెనలో కొంత భాగం నదిలో కూలిపోయింది. 1875లో గంగా నదిపై బ్రిటీష్ వారు ఈ వంతెన నిర్మించారు. దీని నిర్మాణం పూర్తి చేయాటానికి 7 సంవత్సరాల 4 నెలలు పట్టిందని చెబుతారు.. ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్‌ను లక్నోను కలుపుతూ ఉండేది. అయితే, గత కొంతకాలంగా ఈ వంతెనను ట్రాఫిక్ సౌకర్యం కోసం కాన్పూర్ పరిపాలన మూసివేసింది.
ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే, పైన వాహనాలు, సైకిళ్లు ప్రయాణిస్తే, పాదచారులు కింద ఉన్న పుట్‌పాత్‌పై నడిచేవారు. బ్రిటిష్ కాలంలో ఈ వంతెన కాన్పూర్- లక్నో మధ్య ప్రయాణం చేసే ఏకైక మార్గంగా ఉండేది. ఈ స్థిరమైన నిర్మాణాన్ని డిజైన్ చేసిన ఇంజనీర్లు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినవారు. ప్రజలు ఈ వంతెన ద్వారా లక్నో ఉన్నావ్ ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే, కాలక్రమేణా వంతెనలోని స్తంభాలకు పగుళ్లు ఏర్పడటంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడింది. దాంతో PWD (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) వంతెనను మూసివేసింది. వంతెన ఇరువైపులా గోడలతో భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
వీడియో ఇక్కడ చూడండి..
#उन्नाव में गंगा नदी पर अंग्रेजों के जमाने का ऐतिहासिक डबल स्टोरी पुल का एक हिस्स ढह गया।
पुल की जर्जर स्थिति को देखते हुए तीन साल पहले ही इस पर आवागमन बंद कर दिया गया था।
करीब 150 साल पहले अंग्रेजों द्वारा निर्मित यह पुल कानपुर और उन्नाव को जोड़ने के लिए बनाया गया था।… pic.twitter.com/RTcllvGqb5
— Vinay Saxena (@vinaysaxenaj) November 26, 2024
వంతెన శిథిలావస్థకు చేరడంతో 4 ఏళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి ఈ వంతెనను వారసత్వ సంపదగా చూపేందుకు సుందరీకరణ పనులు చేశారు. గంగా వంతెనకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని సంరక్షించి, అందమైన పరిరక్షణ పనులు చేసి, వారసత్వ సంపదగా భవిష్యత్తులో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే వంతెనలో కొంత భాగం 80 అడుగుల మేర కూలిపోయి గంగా జలాల్లో మునిగిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..