నెల రోజులు నాన్ వెజ్ మానేసి చూడండి..! శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అలాగే ఆహారం ఏమాత్రం తేడాలు వచ్చినా వెంటనే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నాన్ వెజ్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంతమేర ప్రయోజనం ఉంటుందనడంలో నిజం ఉన్నట్లుగానే కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అవేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Updated on: Nov 26, 2024 | 3:14 PM

ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. కానీ నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..? ఓ 30 రోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలరోజుల పాటు మాంసాహారం మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు..

ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్‌కు దూరంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్దరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

మాంసాహారాన్ని అధికంగా తీసుకోవాడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎర్రటి మాంసాలు తరచూ తీసుకోవటం వల్ల క్యాన్సర్‌తో సహా కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నాన్‌వెజ్‌లో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ గణణీయంగా తగ్గుతుంది.

అయితే, మాంసాహారాలన్నీ ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగించవు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. అలాగే, మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. హై బీపీతో ఇబ్బంది పడేవారు ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండి చూడండి. నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండి కేవలం కూరగాయలను మాత్రమే తీసుకోవడంతో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.




