- Telugu News Photo Gallery Police case registered against Tollywood actor Sree Tej at Kukatpally police station
Actor Shritej: సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
'పుష్ప' నటుడు శ్రీతేజ్ పై కూకట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటనలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు..
Updated on: Nov 26, 2024 | 1:56 PM

ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో BNS 69, 115(2),318(2) అనే మూడు సెక్షన్ల కూకట్ పల్లి పోలీసులు కేసు పెట్టారు. దీనిపై విచారన చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శరీరక వేధింపులతోపాటు రూ.20 లక్షల నగదు కూడా తన నుంచి తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. గతంలోనూ ఇదే శ్రీతేజ్‌పై ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎవరీ శ్రీతేజ్..? నటుడు శ్రీతేజ్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న పాత్రలు చేసేవాడు. ఆర్జీవీ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోనూ శ్రీతేజ్ నటించాడు. ఆ తర్వాత నారప్ప, మంగళవారం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు.

ఇక స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' మువీలోనూ శ్రీతేజ్ సహాయ నటుడిగా నటిచాడు. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుని కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న శ్రీతేజపై వరుస కేసులు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Actor Shritej




