శనగ పప్పు అందానికే కాదు.. ఆరోగ్యానికీ అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?
శనగపప్పు రుచితో పాటు నాణ్యత కూడా చాలా ఎక్కువ. శనగపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లైనా శనగపప్పు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శనగపప్పుతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 25, 2024 | 9:42 PM

శనగ పప్పు అనేక పోషకాలకు నిధి..శనగపప్పులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కొవ్వుగుణాలు తక్కువగా ఉంటాయి. కప్పు శనగ పప్పులో.. కేవలం 252 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. శనగపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తొందరగా ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

శనగపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచతాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి. శనగపప్పులోని ఆరోగ్యకర కొవ్వు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగేలా చేస్తాయి. తద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

శనగపప్పులో కాల్షియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. శనగపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు.

శనగపప్పులో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. శనగపప్పులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. అందువల్లే ప్రాచీన కాలం నుంచి శనగ పిండిని చర్మం కోసం ఉపయోగిస్తున్నారు.

శనగపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడును చురుగ్గా చేస్తుంది. శనగపప్పులో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల కండరాల కదలికలు మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం దూరమవుతుంది.




