- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines anushka nayanthara samantha doing mass character roles
నరకడం మొదలు పెడితే మాకంటే ఎవరు బాగా నరకలేరంటున్న ముద్దుగుమ్మలు
మాస్ రాజ్‌లు, మాస్ మహారాజ్‌ల గురించి విన్నాం... ఇప్పుడున్న సిట్చువేషన్స్ చూస్తుంటే మాస్ మహరాణుల గురించి మాట్లాడుకోవాలేమో... పైట కొంగు బిగించి కట్టి, చేతిలో కొడవలితో అవతలి వారి పీకలు కసా కసా కోసేస్తున్నారు మన నాయికలు. మొన్నటికి మొన్న అనుష్క ఘాటి గ్లింప్స్ ని మర్చిపోకముందే.. రేసులో నేనూ ఉన్నానంటూ రెడీ అయిపోయారు రాక్కాయి నయన్.
Updated on: Nov 25, 2024 | 9:58 PM

రీసెంట్‌గా తన పర్సనల్ ప్రొఫెనల్ లైఫ్ నేపధ్యంలో ఓ డాక్యుమెంటరీ చేసిన నయన్, ఆ షోలో కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

నయనతార బర్త్ డే సందర్భంగా రాక్కాయి టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఓ పక్కన ఊయలలో చంటిదాని బాగోగులు చూసుకుంటూనే, మరోవైపు కండలు తిరిగిన రౌడీల పని పట్టిన రాక్కాయిగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు నయన్.

ఆమె పైట బిగించి కొడవలి పట్టి వీరవిహారం చేస్తుంటే వారేవా అన్నారు జనాలు.. స్వీటీ శెట్టి ఫ్యాన్స్ అయితే ఘాటి గ్లింప్స్ ని ఇంకోసారి చూసుకుంటున్నారు. యాక్షన్ క్వీన్ అంటూ ఘాటిలో అనుష్కను సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు క్రిష్ జాగర్లమూడి. అనుష్క 2.0 అంటూ ఇన్‌స్టంట్‌గా మెచ్చుకున్నారు ఫ్యాన్స్.

ఆ మధ్య కీర్తి సురేష్ చేసిన సాని కాయిదం సినిమాను మించిపోయిందనుకున్నారు. ప్రస్తుతం రివాల్వర్ రీటా చేస్తున్నారు కీర్తి. అయినా... రా అండ్ రస్టిక్ స్క్రిప్టులను యాక్సెప్ట్ చేయాలంటే కీర్తి సురేష్ పేరు వినిపించేది ఒకప్పుడు... కానీ ఇప్పుడు క్రమేణ ఆమెకు పోటీ పెరుగుతోంది.

ట్రెండ్‌లో ఉన్న విషయాలను ఫాలో కాకుండా ఉండరు సమంత. ఫ్యామిలీమేన్2లో సామ్ యాక్షన్ సీక్వెన్స్ చూసి... వారెవా... ఇన్నాళ్లూ మనం చూసిన సమంత ఈమేనా అని వండర్ అయ్యారు ఆడియన్స్. ఆ రేంజ్‌లో యాక్షన్‌ని ఇరగదీశారు సామ్. రీసెంట్ సిటాడెల్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి... ఫర్‌దర్‌గా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు పక్కా ఫిట్ అవుతారని ఫిక్సయిపోతున్నారు మేకర్స్. సో.. ఇక మాస్ అంటే పదం... హీరోలకే కాదు.. హీరోయిన్లకూ వర్తిస్తుందన్నమాట.




