పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..! ఏం జరిగిందంటే..

ఏకంగా రైలులోని 20 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్‌ను క్లియర్‌ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు.

పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..! ఏం జరిగిందంటే..
Train Derail
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 26, 2024 | 4:47 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌ పరిధిలో ఓ రైలు 20 బోగీలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు బిలాస్‌పూర్‌ నుంచి కట్నీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఖోంగ్‌సార్‌ మధ్య రైలు పట్టాలు తప్పింది. ఏకంగా రైలులోని 20 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్‌ను క్లియర్‌ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు.

మంగళవారం ఉదయం బొగ్గుతో కూడిన గూడ్స్ రైలుకు చెందిన 20 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, బిలాస్‌పూర్-కట్నీ సెక్షన్‌లో అప్ అండ్ డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని వారు తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో ఆ మార్గంలో నడిచే పూరీ యోగ్నాగ్రి రిషికేష్‌ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌, దుర్గ్‌ – ఎంసీటీఎమ్‌ (ఉధంపూర్‌) ఎక్స్‌ప్రెస్‌ సహా పలు ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!