AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: గత పదేళ్లలో రైల్వే శాఖలో 5లక్షల మందిని రిక్రూట్ చేశాం: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. గత దశాబ్దంలో ఐదు లక్షల మంది రైల్వే ఉద్యోగులను పారదర్శకంగా నియమించుకున్నామని తెలిపారు. ఇది 2004-2014 మధ్యకాలంలో నియమించిన 4.4 లక్షల మంది ఉద్యోగులను అధిగమించిందని వివరించారు.. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టడం దీనికి నిదర్శనమని తెలిపారు.

Ashwini Vaishnaw: గత పదేళ్లలో రైల్వే శాఖలో 5లక్షల మందిని రిక్రూట్ చేశాం: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Indian Railways
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2024 | 2:44 PM

Share

పదేళ్లలో రైల్వే శాఖ 5లక్షల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.. గత దశాబ్ద కాలం (2014 -2024) లో రైల్వే శాఖ ఐదు లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసిందని, ఇది అంతకుముందు దశాబ్దం (20042014) కంటే ఎక్కువగానే ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. నాగ్‌పూర్‌లోని అజనీ రైల్వే గ్రౌండ్‌లో జరిగిన ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ సదస్సులో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం 12,000 జనరల్ కోచ్‌లు ఉత్పత్తిలో ఉన్నాయని, రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

2004 – 2014 మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ సంఖ్య 4.4 లక్షలు అని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. ఇది అంతకుముందెన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బిఎల్ భైరవ, సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ధరమ్‌వీర్ మీనా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ నీను తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంటులో అడుగుపెట్టే ముందు రాజ్యాంగానికి తలవంచాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంజ్ఞను కూడా వైష్ణవ్ అభినందించారు. రాజ్యాంగం పట్ల గౌరవం ప్రతీకాత్మకతకు మించినది.. అది ఆయన చర్యలో ప్రతిబింభిస్తుందన్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్ కృషిని స్మరించుకునే సావనీర్‌ను వైష్ణవ్ ఆవిష్కరించారు. ముందుగా దీక్షాభూమిలోని సెంట్రల్ మెమోరియల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల సదస్సు ఇవ్వాల్టితో ముగియనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..