దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!

ఓవైపు చలి చంపేస్తోంది.. మరోవైపు దోమలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఇంట్లో దోమల్ని నివారించడానికి చాలామంది మస్కిటో కాయిల్ వాడుతుంటారు. ఈ దోమలను చంపే కాయిల్స్ మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయన్న విషయం తెలుసా? కాయిల్ నుంచి వెలువడే పొగ వల్ల చాలా నష్టాలున్నాయి. అవేంటో చూద్దాం.

Jyothi Gadda

|

Updated on: Nov 26, 2024 | 5:54 PM

మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది అనేక శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌లోని సమ్మేళనాలు తలనొప్పిని కూడా ప్రేరేపిస్తాయి. అందుకే చాలామందికి దోమల నివారణ మందు వాసన చూస్తే తలనొప్పి వస్తుంది.

1 / 5
మస్కిటో కాయిల్ ద్వారా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ సమస్య ఉన్నవారు ఈ పొగకు దూరంగా ఉండటమే మంచిది. దోమలను నివారించడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయి.

2 / 5
దోమలను చంపడానికి ఇంట్లో ప్రతిరోజూ కాయిల్ ఉపయోగిస్తే దాని పొగ వల్ల ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ పొగకు దూరంగా ఉండండి. ఇంట్లో పిల్లలు ఉంటే వీలైనంత వరకు మస్కిటో కాయిల్స్ వాడటం మానేయండి. దీని పొగ వల్ల పిల్లలో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
క్రానిక్ అబ్స్‌ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఒక రకమైన ఊపిరితిత్తుల సమస్య. ఊపిరితిత్తుల్లో అడ్డంకులు వచ్చినపుడు ఈ సమస్య వస్తుంది. మస్కిటో కాయిల్ వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

4 / 5
దోమలను నివారించడానికి సహజ మార్గాలు ఎంచుకోండి. దోమ తెరలు మీరు పడుకునే బెడ్ చుట్టూ కట్టుకోండి. లేదంటే సహజంగా దోమలను తరిమేసే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి.

5 / 5
Follow us