Horoscope Today: వారు ధనపరంగా ఎవరికీ హామీలివ్వకండి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 28, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అంచే అవకాశముంది. వృషభ రాశి వారు ఎవరి విషయంలోనూ తలదూర్చకపోవడం మంచిది. మిథున రాశి వారు కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు ధనపరంగా ఎవరికీ హామీలివ్వకండి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 28, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి వారు ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. మిథున రాశి వారు కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగపరంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యల విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగ జీవి తం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. రాదను కున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఏ విషయంలోనైనా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా కష్టనష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగం జీవితంలో అధికారులకు నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతలను అప్పగించే సూచనలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభి స్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా మాటకు, చేతకు విలువ ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు వేతనాలు, సౌకర్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ యాలు శుభ ఫలితాలనిస్తాయి. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగు తుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. అదనపు పని భారం నుంచి ఉపశమనం లభి స్తుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహిం చండి. కొద్ది ప్రయత్నంతో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు అవ కాశాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సహోద్యోగుల బాధ్యతలను కూడా పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొందరు ప్రముఖు లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లాభాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆదాయం బాగా పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి పెళ్లి సంబం ధాల విషయంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా సంతృప్తికర పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా మారే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంతృప్తి కలిగిస్తాయి. కొన్ని ఇష్టమైన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే సూచ నలున్నాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయపరంగా ఆశిం చిన అభివృద్ధి ఉంటుంది. సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటి బాధ్యతలతో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.