కీలక గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారమే..!

డిసెంబర్ నెలలో శుక్ర, రవి గ్రహాలు మాత్రమే రాశులు మారుతున్నాయి. మిగిలిన గ్రహాలన్నీ యథాప్రకారం సంచారం సాగిస్తున్నాయి. ఈ శుక్రుడు డిసెంబర్ 2 నుంచి తనకు మిత్ర క్షేత్రమైన మకర రాశిలోనూ, రవి డిసెంబర్ 16 నుంచి తనకు మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలోనూ దాదాపు ఈ నెలంతా సంచారం సాగిస్తాయి. ఈ శుక్ర, రవుల రాశి మార్పు వల్ల ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

కీలక గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారమే..!
December 2024 HoroscopeImage Credit source: Getty Images
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 27, 2024 | 6:42 PM

డిసెంబర్ నెలలో శుక్ర, రవి గ్రహాలు మాత్రమే రాశులు మారుతున్నాయి. మిగిలిన గ్రహాలన్నీ యథాప్రకారం సంచారం సాగిస్తున్నాయి. ఈ శుక్రుడు డిసెంబర్ 2 నుంచి తనకు మిత్ర క్షేత్రమైన మకర రాశిలోనూ, రవి డిసెంబర్ 16 నుంచి తనకు మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలోనూ దాదాపు ఈ నెలంతా సంచారం సాగిస్తాయి. ఈ శుక్ర, రవుల రాశి మార్పు వల్ల ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి రవి, శుక్రులిద్దరూ అనుకూల స్థానాల్లో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు, హోదా మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదరడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది.
  2. వృషభం: రాశినాథుడైన శుక్రుడు భాగ్య స్థానంలోనూ, రవి నెల ప్రథమార్థమంతా సప్తమ స్థానంలోనూ సంచ రించడం వల్ల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం లేదా గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. పెళ్లి, గృహ ప్రవేశం, ఆస్తుల కొను గోలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశీ ప్రయత్నాలకు ఆటం కాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పిత్రార్జితం లభించడం జరుగుతుంది.
  3. సింహం: రాశినాథుడు రవి పంచమ స్థానంలో సంచారం చేయడం, శుక్రుడు షష్ట స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగపరంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మరింత ప్రాభవం, ప్రాధాన్యం కలిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుం బంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక లాభదాయక వ్యవహారాలను చేపట్టడం జరుగుతుంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోనూ, 16 నుంచి రవి తృతీయ స్థానంలోనూ సంచారం ప్రారం భిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. సామాజికంగా హోదా పెరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశిలో రవి, ధన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల అపారమైన ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సొమ్ము అనుభ వించే యోగం పడుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లోపట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు.
  6. మకరం: ఈ రాశిలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలున్నా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. శుభకార్యాలు జరగడానికి అవ కాశం ఉంది. అనేక వైపుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..