Lifestyle: ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ అవ్వాల్సిందే

డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా షుగర్‌ పేషెంట్స్‌ ఎక్కువుతున్నారు. అయితే షుగర్‌ వ్యాధిని ముందుగా గుర్తించి తగితి చికిత్సలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్‌ ముందు చర్మంపై కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చు..

Lifestyle: ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ అవ్వాల్సిందే
Diabetes
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2024 | 5:24 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 ఏళ్ల వారిలో కూడా బయాబెటిస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. అయితే డయాబెటిస్‌ను మొదటి దశలోనే గుర్తించి జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ సమస్యను శరీరం మనల్ని ముందుగానే అలర్ట్‌ చేస్తుంది.

ఇందుకు కొన్ని రకాల సంకేతాలను అందిజేస్తుంది. సాధారణంగా డయాబెటిస్‌ అనగానే కంటి సంబంధిత సమస్యలు, అధికంగా మూత్ర విసర్జన చేయడం, గాయాలు తగ్గడం వంటి సమస్యలే అనుకుకుంటారు. కానీ చర్మ సంబంధిత సమస్యలు కూడా డయాబెటిస్‌కు ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చర్మంపై కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మంపై దురద, ఎరుపు వంటి సమస్యలు డయాబెటిస్‌ ప్రాథమిక లక్షణంగా భావించాలని అంటున్నారు. డయాబెటిస్ బారిన పడిన వారిలో చర్మంపై పొక్కులు కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల వేళ్లపై బొప్పలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పొక్కులు తెలుపు రంగులో ఉంటాయి. అయితే ఎలాంటి నొప్పి ఉండదు. అయితే అప్పుడప్పుడు వచ్చే ఈ బొప్పలు సాధారణంగా మూడు వారాల తర్వాత వాటంతటవే తగ్గిపోతాయి. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్‌ బాధితుల్లో స్క్లెరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇందులో చర్మం సాధారణం కంటే మందంగా మారుతుంది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వేళ్లు, కాళ్ల చర్మం మందంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయనడానికి ఇదొక సంకేతంగా చెప్పొచ్చు. నైక్రోబయోసిస్‌ కూడా డయాబెటిస్‌కు సంకేతంగా చెప్పొచ్చు. కణాలు చనిపోవడాన్ని ఇలా అంటారు. ఈ సమస్య కారణంగా చర్మంపై చిన్న, చిన్నగా కనిపించే ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి. కాబట్టి చర్మంపై ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.