Hyderabad: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలు..

భారీ పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రాస్‌గా నిలుస్తోన్న హైదరాబాద్ మహా నగరంలో మరో పెద్ద సంస్థ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దేశీయంగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ సంస్థ రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది..

Hyderabad: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలు..
Hyderabad
Follow us
Prabhakar M

| Edited By: Narender Vaitla

Updated on: Nov 26, 2024 | 5:02 PM

హైదరాబాద్ మహా నగరంలో మరో భారీ పెట్టుబడి వస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతగానో పేరుగాంచిన.. అంబర్-రెసోజెట్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ. 250 కోట్లతో రాష్ట్రంలో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

అంబర్-రెసోజెట్ పరిశ్రమ ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీదారుగా దేశవ్యాప్తంగా పేరుపొందింది. రూమ్ ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాలకు ఈ సంస్థ ప్రముఖ ప్ర‌మోట‌ర్‌గా గా ఉంది. హైదరాబాద్‌ను ఈ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్‌కు డెస్టినేష‌న్ గా ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కంపెనీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCB) ఉత్పత్తి కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. వందేభారత్ రైళ్లు, మెట్రో రైళ్లు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన ఎయిర్ కండిషనింగ్ పరికరాల తయారీలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ మరింత పరిశ్రమలను ఆకర్షించే దిశగా ప్రోత్సాహకరంగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..