Winter Tips: ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.! వీడియో
చలికాలంలో స్కిన్ డ్రైగా, నల్లగా మారుతుంది. పైగా చలి కారణంగా స్కిన్ బాగా ఎక్స్‌పోజ్ అవుతుంది. దీంతో చేతులు, కాళ్లు, మిగతా భాగాలు కూడా నల్లగా మారిపోతాయి. ఈ పరిస్థితి చాలా అసౌకర్యాన్ని కలిగించడమే కాదు.. తెలియని ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి చక్కని శరీర ఛాయను సొంతం చేసుకోడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. నల్లగా మారిన చేతులు, కాళ్లను చక్కగా క్లీన్ చేసే ఓ మంచి ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూజల్లో వాడే కర్పూరాన్ని మనం అందాన్ని పెంచేందుకు కూడా వాడొచ్చు. ఇందులో క్రిమినాశక, యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి. దీంతో దురద, గాయాలు, చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అదనంగా, మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మ ఛాయని మెరుగుపరుస్తుంది. కొబ్బరినూనె మన ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడంలో కూడా ముందుంటుంది. దీనిని వాడడం వల్ల చర్మం ఎక్కువ రోజులు హైడ్రేట్‌గా ఉంటుంది. పైగా కొల్లాజెన్ పెరుగుతుంది. దీంతో మచ్చలు తగ్గుతాయి. చర్మానికి చాలా హెల్ప్ అవుతుంది. దీనిని పెదాలకు లిప్‌బామ్‌లా కూడా రాయొచ్చు.
ఈ ప్యాక్ తయారు చేసుకోడానికి కొద్దిగా కర్పూరం, రెండు టీ స్పూన్స్ కాఫీ పొడి, అర టీస్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ కొబ్బరినూనె, ఒక టీ స్పూన్ షాంపూ, అర టీ స్పూన్ చక్కెర తీసుకొని, వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, కాళ్లు, చేతులకు అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత, చేతులు తడి చేసుకొని మెల్లగా ఓ 5 నిమిషాలపాటు స్క్రబ్ చేయండి. ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. దీనిని రెగ్యులర్‌గా వాడితే మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండుసార్లు ఇది వాడొచ్చు. ఈ డీ ట్యాన్ ప్యాక్ కేవలం చేతులు మాత్రమే కాదు.. నల్లగా ఉన్న శరీర భాగాల్లోనూ వాడొచ్చు. దీని వల్ల టాన్ తగ్గి శరీరమంతా మెరుస్తుంది. అయితే మరీ ఎక్కువగా స్క్రబ్ చేయకూడదు. అలాగే ఈ స్క్రబ్ కూడా గరుకుగా లేకుండా స్మూత్‌గా ఉండేలా చూసుకోండి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.