26 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు.. నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదు

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి కన్న తండ్రే అమానుషంగా చంపేశాడు. పసిబిడ్డ డెడ్ బాడీని ఓ చోట పాతి పెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి.. పేరు మార్చుకుని... ఓ రైతు దగ్గర తోటలో పనికి చేరాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

26 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు.. నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదు
Crime News
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 26, 2024 | 5:00 PM

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి కన్న తండ్రే అమానుషంగా చంపేశాడు. పసిబిడ్డ డెడ్ బాడీని ఓ చోట పాతి పెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి.. పేరు మార్చుకుని… ఓ రైతు దగ్గర తోటలో పనికి చేరాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు.. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇలా 26 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో ఈ ఘటనను అంతా మరిచిపోయారులే అనుకున్నాడు.. పోలీసులు కూడా ఇక పట్టించుకోరు.. తనకి ఇంకా ఏం కాదులే అనుకున్నాడు… ఇంకేముంది తన రెండో భార్య చిన్న కూతురు వివాహానికి తన చిన్ననాటి మిత్రుడిని ఆహ్వానించాడు. తన చిన్న కూతురు వివాహానికి రావాలంటూ పెండ్లి పత్రిక కూడా పంపించాడు. ఇంకేముంది అక్కడే దొరికిపోయాడు. ఆ పెళ్లి పత్రికను పట్టుకుని పోలీసులు కూపీ లాగారు. మాటు వేసి నిందితుడిని పట్టుకుని.. 26 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు…

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నేహట్టిలో 26 సంవత్సరాల క్రితం కుమారుడిని హత్య చేసి పరారైన తిప్పేస్వామి అలియాస్ కృష్ణ గౌడను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తిప్పే స్వామి, కరియమ్మ భార్యాభర్తలు… వారికి ఇద్దరు కుమారులు. భార్య కరియమ్మపై అనుమానంతో తిప్పేస్వామి చిన్న కుమారుడు శివలింగయ్య (6నెలలు) తనకు పుట్టలేదని భావించి 1998 అక్టోబర్ రెండవ తేదీన దిన్నేహట్టి గ్రామ శివారు పొలాల్లో కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి… అక్కడే గొయ్యి తీసి.. పాతిపెట్టి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు నిందితుడు తిప్పేస్వామి కోసం గాలిస్తూనే ఉన్నారు.

అయితే, కుమారుడిని చంపి పరారైన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అర్దుర్ గ్రామానికి వెళ్లి అక్కడ ఓ రైతు దగ్గర తోటలో పనిచేసేందుకు పనికి కుదిరాడు. కృష్ణ గౌడగా పేరు మార్చుకుని అదే ప్రాంతానికి చెందిన తార అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఏళ్లు గడిచిన స్వగ్రామం రాకుండా 26 సంవత్సరాలు తిప్పేస్వామి అలియాస్ కృష్ణ గౌడ అక్కడే ఉన్నాడు. కుమారుడు చనిపోవడంతో మొదటి భార్య కరియమ్మ ఊరు వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయిందని… గ్రామస్తులంతా విషయం మర్చిపోయారని… పోలీసులు కూడా కేసు గురించి పట్టించుకోవడంలేదని తిప్పేస్వామి చిన్ననాటి స్నేహితుడు నాగరాజు చెప్పాడు. దీంతో నాలుగు నెలల క్రితం తన రెండవ భార్య కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా చిన్ననాటి స్నేహితుడు నాగరాజుకు పెండ్లి పత్రిక పంపించాడు.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన పెండింగ్ కేసులపై దృష్టి పెట్టిన పోలీసులు… నాగరాజు.. తిప్పేస్వామి రెండో భార్య కూతురు పెళ్లికి వెళ్లి వచ్చిన విషయం తెలుసుకుని ఆరా తీశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తిప్పేస్వామి అలియాస్ కృష్ణ గౌడ కోసం స్కెచ్ వేశారు. తిప్పేస్వామి స్వగ్రామమైన దిన్నేహట్టిలో ఉన్న భూమి వివాదం పరిష్కరించుకోవాలని నాగరాజు, నిందితుడు తిప్పే స్వామికి చెప్పాడు. భూమికి సంబంధించిన వివాదం పరిష్కారం కోసం దిన్నేహట్టికి వచ్చిన తిప్పేస్వామిని పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నేరం చేసి 26 ఏళ్లయినా.. ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టుతో తెలిసింది. అందుకే చట్టం దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటారు. 26 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పి రత్న అభినందనలు తెలుపుతూ… రివార్డు అందజేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
రూ.30 వేలలోనే లభిస్తున్న బెస్ట్ 8 జీబీ స్మార్ట్ ఫోన్లు
రూ.30 వేలలోనే లభిస్తున్న బెస్ట్ 8 జీబీ స్మార్ట్ ఫోన్లు
ఈ నటి సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. మూడు పెళ్లిళ్లు
ఈ నటి సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. మూడు పెళ్లిళ్లు
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.