Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది! వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా పుష్ప రాజ్ కటౌట్.. వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కోసం అభిమానులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 05న గ్రాండ్ గా ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫీవర్ స్టార్ట్ అయ్యింది.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది! వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా పుష్ప రాజ్ కటౌట్.. వీడియో
Pushpa 2
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2024 | 2:55 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2’. మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప 2 మేనియా ప్రారంభమైంది. పుష్పరాజ్ కు స్వాగతం పలికేందుకు అల్లు అర్జున్ అభిమానులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సంగం శరత్‌ థియేటర్‌ వద్ద ఏకంగా 108 అడుగుల ఎత్తైన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.ఇటీవలే అశేష అభిమానుల సమక్షంలో ఈ కటౌట్ ను ఆవిష్కరించారు. ఆకాశాన్ని తాకేలా కనిపిస్తోన్న ఈ పుష్ప రాజ్ కటౌట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. విశాఖలోనే కాదు ఏపీలో ఇప్పటివరకు ఏ హీరోకు ఇలాంటి భారీ కటౌట్ ఏర్పాటుచేయలేదంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

కాగా పుష్ప 2 సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే పలు చోట్ల భారీ కటౌట్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ లో 108 అడుగుల పుష్పరాజ్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ‘ తెలుగు చిత్రసీమలో ఎందరో స్టార్ హీరోలు వచ్చి వెళ్లిపోయారు. వారి కోసం చాలా కటౌట్‌లను నిర్మించారు. అయితే ఇంత పెద్ద కటౌట్‌ను ఎప్పడూ ఏర్పాటు చేయలేదు. సుమారు 108 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో అల్లు అర్జున్ కటౌట్‌ను నిర్మించడం ఇదే తొలిసారి’ అంటూ బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

వీడియో ఇదిగో..

ఇప్పటికే రిలీజైన ‘పుష్ప 2’ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంచనా వేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

108 అడుగుల హైట్ తో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.