Actress Laya: పోలవరం ప్రాజెక్టు వద్ద సందడి చేసిన హీరోయిన్ లయ.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చే సింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ అందాల తార పలు సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది.

Basha Shek

|

Updated on: Nov 25, 2024 | 9:02 PM

వేణు నటించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లయ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన లయ  తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రలోనే కనిపించింది. అందుకే ఈ ముద్దుగుమ్మకు ఫ్యామిలీ అడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది

2 / 6
 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో  దాదాపు 40కు పైగ సినిమాల్లో నటించింది లయ. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

3 / 6
2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.

4 / 6
సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది లయ. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

5 / 6
ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న లయ తాజాగా పోలవరం డ్యామ్ ను సందర్శించింది. తన స్నేహతురాలితో కలిసి అక్కడకు వెళ్లిన ఆమె సరదాగా ఫొటోలు దిగింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి

6 / 6
Follow us