Lucky Baskhar OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మహానటి, సీతారామం సినిమా తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మరో తెలుగు సినిమా లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Lucky Baskhar OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Lucky Baskhar Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2024 | 5:22 PM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. తొలిప్రేమ, సార్ చిత్రాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ సినిమా ను నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. బరిలో అమరన్ , క, బఘీరా వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లక్కీ భాస్కర్ కు సుమారు రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. బ్యాకింగ్ సెక్టార్ నేపథ్యానికి ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కించాడు వెంకీ అట్లూరి. అలాగే స్టాక్‌ మార్కెట్, భారతీయ మధ్యతరగతి మనస్థత్వాల అంశాలన ప్రస్తావించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న లక్కీ భాస్కర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాడు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లక్కీ భాస్కర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా దుల్కర్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ‘అదృష్టం ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళుతుంది? నవంబర్ 28న నెట్ ఫ్లిక్స్ లో మా లక్కీ భాస్కర్ ని చూడండి’ అని పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందుబాటులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్.. మరో మూడు రోజుల్లో..

లక్కీ భాస్కర్ సినిమాలో రాంకీ, సూర్య శ్రీనివాస్, మానస చౌదరి, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్, కసిరెడ్డి, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.  జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.